Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాంకేతికత ఎంతగా పెరుగుతోందో, దానికి తోడుగా సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ శాఖల పేరిట నకిలీ సందేశాలు పంపి నిలువునా ముంచేసే కొత్త రకం సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక ఘటనే దీనికి నిదర్శనం. మన అజాగ్రత్తే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని చెప్పడానికి ఈ ఉదంతం ఒక హెచ్చరిక.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఒక దారుణమైన సైబర్ మోసం వెలుగుచూసింది. ఇక్కడికి చెందిన మజ్హర్ అనే వ్యక్తి మొబైల్‌కు వాట్సాప్ ద్వారా ఒక సందేశం వచ్చింది. అది రవాణా శాఖ నుంచి వచ్చిన “ఈ-చలాన్” లాగా కనిపించింది. వాహనానికి చలాన్ పడిందని నమ్మిన ఆయన, ఆ మెసేజ్‌తో పాటు వచ్చిన apk ఫైల్‌ను క్లిక్ చేసి మొబైల్లో ఇన్స్టాల్ చేశారు. అంతే, ఆ యాప్ ఇన్స్టాల్ అయిన కొద్దిసేపటికే, ఆయనకు తెలియకుండానే ఆయన ఫోన్ పే ఖాతా నుండి ఏకంగా రూ.95,100 నగదు విడతల వారీగా మాయమైపోయింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
ఈ రకమైన మోసాలను “Apk Malware Scam” అంటారు. ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ లేదా కొరియర్ సర్వీస్ పేరిట నకిలీ వాట్సాప్ సందేశాలు పంపి, వాటితో పాటు యాప్ ఫైళ్లను పంపుతారు. గూగుల్ ప్లే స్టోర్ కాకుండా, బయట నుండి ఇలాంటి ఫైళ్లను ఇన్స్టాల్ చేయగానే మన ఫోన్ నియంత్రణ మొత్తం సైబర్ దొంగల చేతికి వెళ్తుంది. దీనివల్ల మనకు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య సమాచారాన్ని వారు సులభంగా దొంగిలించి, మన అకౌంట్ లోని డబ్బును కాజేస్తారు.
ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుండి వచ్చే ఎటువంటి లింకులను లేదా యాప్ ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదు. మీ వాహనానికి చలానా ఉందో లేదో తెలుసుకోవడానికి రవాణా శాఖ అధికారిక వెబ్సైట్లను మాత్రమే వాడాలి. ఏ రకమైన యాప్స్ అయినా సరే కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాట్ గా సైబర్ మోసానికి గురైతే, వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!