Site icon NTV Telugu

Jubilee Hills Case: నిందితుల ఊహించని ట్విస్ట్.. బెండ్ చేసిన బెంజ్!

Jubilee Hills Innova Car

Jubilee Hills Innova Car

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన కేసులో ఊహించని పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుల్ని అరెస్ట్ చేస్తోన్న పోలీసులు.. సాక్ష్యాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజ్ కార్లని స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాజాగా అందరూ విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నోవా కారుని పరిశీలించిన పోలీసులకు.. ఆ కారుని నిందితులు సర్వీసింగ్ చేయించినట్టు తెలిసింది. అందులో ఉన్న సాక్ష్యాలేవీ దొరక్కుండా ఉండేందుకు నిందితులు తెలివిగా సర్వీసింగ్ చేయించారని తేలింది.

అయితే.. ఆ ఇన్నోవా కారులో ప్రింట్స్, ఇతర క్లూస్ దొరుకుతాయన్న ఉద్దేశంతో నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు.. బెంజ్ కారులో మాత్రం అమ్మాయి చెప్పులు, ఇయర్ రింగ్స్‌తో పాటు మరికొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇదిలావుండగా.. ఈ కేసులో బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఆ బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగానే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో A6గా ఎమ్మెల్యే కొడుకు పేరు నమోదయ్యే అవకాశం ఉంది. బయటకొచ్చిన వీడియోతో పాటు బాలిక స్టేట్‌మెంట్ ప్రకారం.. పోలీసులు లీగల్ ఒపీనియన్‌ ఒపీనియన్ తీసుకోనున్నారు. పోక్సో చట్ట ప్రకారం.. బాధితురాలి స్టేట్‌మెంటే ఫైనల్ కానుంది.

Exit mobile version