Site icon NTV Telugu

Ganja Smuggling: పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. ఎలా చిక్కారంటే..!

Ganja Smuggling

Ganja Smuggling

Ganja Smuggling: పుష్ప సినిమా టాలీవుడ్‌నే కాదు.. పాన్‌ ఇండియా లేవల్లో ఓ ఊపు ఊపింది.. అయితే, ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దర్శకుడు ఉపయోగించిన ట్రిక్కులను.. చాలా సందర్భాల్లో దొంగలు ఉపయోగించిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, కాకినాడ జిల్లా జగ్గంపేటలో పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జగ్గంపేట, కిర్లంపూడి పోలీసులు టోల్‌గేట్‌ వద్ద అదుపులోనికి తీసుకున్నారు.

Read Also: BJP: ‘‘ఆమె ఐఏఎస్ అధికారినా లేక పాకిస్తానీనా.?’’ వివాదంగా బీజేపీ నేత కామెంట్స్..

పెద్దాపురం డీఎస్పీ హరిరాజు తెలిపిన వివరాల ప్రకారం ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా కి సమీపంలో ఒక బొలెరో కారు ఒక మారుతి బ్రేజా కారు స్వాధీనం చేసుకుని నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలను, ఒక బాలుడిను అదుపులోనికి తీసుకుని. వారి వద్ద 163.250 కేజీల గంజాయి, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరంతా పుష్ప సినిమా తరహాలో వాహనాల్లో లోపల భాగంలో సీలింగ్‌కు అరలు పెట్టి ఆ అరల్లో గంజాయిని నింపి తరలిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా మహిళలతో కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తుండగా పూర్తి సమాచారంతో వెహికల్స్ ను పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు..

Exit mobile version