Site icon NTV Telugu

Honour killing: పరువు పోయిందని.. నవదంపతుల దారుణ హత్య..

Honour Killing

Honour Killing

అభివృద్ధిలో.. టెక్నాలజీతో పోటీ పడుతూ అంతా పరుగులు పెడుతున్నా.. ఇంకా మతం, కులం లాంటివి అడ్డుగోడలుగా నిలిస్తున్నాయి.. పరువు తీశారని.. ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. కులాంతర వివాహం చేసుకున్నా.. మతాంతర వివాహం చేసుకున్నా జీర్ణించుకోలేక వెంటాడి వెంబడించి చంపేస్తున్నవారు కొందరైతే.. నమ్మించి గొంతుకోసే దారుణమైన మనుషులు కూడా ఉన్నారు.. తాజాగా, తమిళనాడులో జరిగిన డబుల్‌ మర్డర్‌ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

Read Also: Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్‌ దూరం.. కారణం అదేనా..?

తమిళనాడులోని కుంభకోణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శరణ్యను మోహన్‌ అనే యువకుడు ప్రేమించాడు.. అయితే, వారి పెళ్లికి కులం అడ్డుగా నిలిచింది.. వారి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.. అంతేకాదు.. శరణ్యను సమీప బంధువైన రంజిత్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తమ్ముడు శక్తివేల్ పట్టుబట్టాడు. అయితే, పెద్దలను, తమ్ముడిని ఎదిరించి శరణ్య.. తాను ప్రేమిస్తున్న వేరే కులానికి చెందిన మోహన్‌ను ఐదు రోజుల క్రితం పెళ్లి చేసుకుంది.. విడిగా కాపురం పెట్టారు. అయితే, ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు శరణ్య తమ్ముడు శక్తివేల్.. వాళ్లను ఎలాగైనా మట్టుబెట్టాలని ప్లాన్‌ చేశాడు.. జరిగింది ఎదో జరిగిపోయింది.. పార్టీ చేసుకుందాం రండీ అంటూ కుంభకోణం సమీపంలోని ఓ ప్రాంతానికి శరణ్య-మోహన్‌ను పిలిపించాడు.. పార్టీలో ఉన్న సమయంలో తమ్ముడు శక్తివేల్, శరణ్యను పెళ్లి చేసుకోవాలని చూసిన రంజిత్‌ ఒక్కసారిగా నవ దంపతులపై దాడి చేశారు.. కత్తిలతో పొడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టరు.. అయితే, శక్తివేల్, రంజిత్‌ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Exit mobile version