Shocking : సంతోష్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడి మురుగు నాలాలో సుమారు నెలరోజుల వయస్సు గల శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంతోష్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, చిన్నారి మృతదేహాన్ని నాలా నుంచి బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సంతోష్ నగర్ ఇన్‌స్పెక్టర్ కోలా సత్యనారాయణ తెలిపారు. శిశువు మృతికి గల కారణాలు, ఘటన వెనుక ఉన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తొక్కలతో.. పెరుగును మరింత పోషకమైనదిగా చేసిన బిహెచ్‌యు శాస్త్రవేత్త
