ఏం జరిగిందో ఏమో.. కళ్లు సరిగా తెరవని ఓ పసికందు ప్రాణాలొదిలాడు.. ఈ లోకానికి వచ్చి రెండు మూడు రోజులు కాకముందే లోకం విడిచి పరలోకాలకు వెళ్లిపోయాడు ఓ పసివాడు. ఎన్నో ఆశలతో నవ మాసాలు మోసి, కన్న బిడ్డ దూరం కావడంతో తల్లితండ్రుల గుండె రాయి అయింది. కన్న బిడ్డకు కనీసం అంతిమ సంస్కారాలు జరపకుండా ఇంట్లోనే చెత్తలా మురికి కాలువలో విసిరేశారు ఆ తల్లిదండ్రులు. నంద్యాల జిల్లా గోపాల్ నగర్ ప్రాంతంలోని శ్యామ కాలువ మురికి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చింది ఓ పసివాడి మృతదేహం.
చేతికి ఆసుపత్రి ట్యాగ్ ఉండటంతో ఆ పసికందు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. జన్మనెత్తి రెండు మూడు రోజులు రాకముందే, కళ్ళు తెరిచి లోకాన్ని చూడకముందే అనంత లోకాలకు వెళ్లిపోయాడు పసివాడు. కానీ ఈ అల్ప ఆయుష్కుడిపై ప్రేమ చూపలేదు తల్లిదండ్రులు. మురికి నీటితో కంపు కొడుతున్న శ్యామ కాలువలో నిర్ధాక్షణ్యంగా విసిరేసారు వీరు. శ్యామ కాలువలో కొట్టుకొస్తున్న పసివాడి మృతదేహాన్ని తీసి ఒడ్డున పెట్టారు కొందరు చిన్నారులు.
Read Also: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీని ఎవరు, ఎందుకు చంపారు.? ఈ కేసు పూర్వాపరాలివే..
వీరందంచిన సమాచారాన్ని ఆధారంగా పసివాడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు టూ టౌన్ పోలీసులు. మృతదేహంపై ఉన్న ఆసుపత్రి ట్యాగ్ పై చంద్ర శేఖర్ అనే పేరు వుంది. తల్లిదండ్రులను గుర్తించడానికి విచారణ చేపట్టారు పోలీసులు. కానీ దయ ప్రేమాభిమానాలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పాపానికి అనాథలా ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు వెళ్లిపోయాడు పసివాడు. ఈ ఘటన స్థానికంగా కన్నీళ్ళు తెప్పించింది.
Read Also: MLA Purchasing Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు
