Site icon NTV Telugu

AP Police: డిప్యూటీ సీఎం పవన్‌, భార్య, కుమారుడిపై అనుచిత పోస్ట్‌.. ముగ్గురి అరెస్ట్‌..!

Pawan

Pawan

AP Police: సోషల్‌ మీడియాలో కొందరు ఏదిపడితే అది పోస్ట్‌ చేసి చిక్కుల్లో పడుతున్నారు.. కొందరు కావాలని పెట్టి కష్టాలు కొని తెచ్చుకుంటుంటే.. మరికొందరు వాటిని షేర్‌ చేసి, లైక్‌ చేసి ఆ వివాదంలో చిక్కుకుంటున్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం విదితమే.. స్వల్పగాయాలతో బయటపడిన మార్క్‌ శంకర్‌ ప్రస్తుతం రెస్ట్‌ తీసుకుంటున్నాడు. అయితే, ఈ నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు.. ఆయన భార్య అన్నా లెజినోవా.. కుమారుడు మార్క్‌ శంకర్‌పై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు.. పోలీసులు.. అయితే, వారిని అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది..

Read Also: Rains: రైతన్నలకు గుడ్ న్యూస్.. మాన్‌సూన్ అప్‌డేట్ వచ్చేసింది.. ఈ ఏడాది జోరుగా వానలు..

కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు కర్నూలు పోలీసులు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, భార్య అన్నా లెజినోవా, వాళ్ల కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారట యువకులు.. దీనిపై గుంటూరులో సైబర్ క్రైం క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.. ముగ్గురు యువకులు పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు.. ఇక, పుష్పరాజ్ అల్లు అర్జున్ అభిమానిగా తెలుస్తోంది.. ఉదయ్ కిరణ్.. ఫయాజ్ సెల్ షాపు నిర్వాహకులు కాగా.. గతంలో వీరి సెల్ షాపులో పుష్పరాజ్ పనిచేశాడు.. పుష్పరాజ్ సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్‌లు పెట్టగా.. వాటికి మిగతా ఇద్దరూ లైక్ కొట్టినట్లు సమాచారం.. అయితే, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సమాచారాన్ని గోప్యంగా నుంచి ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం.

Exit mobile version