Site icon NTV Telugu

Shocking news: పిల్లలు పుట్టడం లేదని వైద్యురాలిని చంపిన అత్తామామలు.. భర్త మర్డర్ ప్లాన్..

Shocking News

Shocking News

Shocking news: పిల్లలు పుట్టడం లేదని, వివాదాల కారణంగా 30 ఏళ్ల వైద్యురాలిని అత్తమామలే దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను కప్పిపుచ్చడానికి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో జరిగింది. డాక్టర్ రేణుక సంతోష్ హోనకాండేని ఆమె అత్తమామలు జయశ్రీ, కామన్న హోనకాండే హత్య చేశారు. భర్త కూడా హత్యకు కుట్ర పన్నినట్లు పోలీస్ విచారణలో తేలింది.

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో అత్త జయశ్రీ, రేణుకను కిందకు తోసేసింది, ఆపై రాళ్లతో దాడి చేసింది. మామ కామన్న ఆమె గొంతు నులిమి చంపారు. వీరిద్దరు దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు బైక్‌ టైర్‌లో చీర చిక్కుకున్నట్లు, ఆమె మృతదేహాన్ని 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. మే 18న జయశ్రీ, రేణుకను గుడికి తీసుకెళ్లిన తర్వాత ఇంటికి వచ్చే సమయంలో రాత్రి పూట హత్య చేశారు.

అయితే, ఈ ప్లాన్‌లో కేవలం రేణుకకు మాత్రమే గాయాలు ఉండటం, మిగిలిన ఇద్దరికి గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేశామని బెళగావి ఎస్పీ భీమశంకర్ గులేద్ అన్నారు. క్షుణ్ణంగా దర్యాప్తు చేయడంతో జయశ్రీ, కామన్న హత్య చేసినట్లు అంగీకరించారని, వారి కుమారుడు సంతోష్ హోనకాండే రేణుకను చంపడానికి వారిని ప్రేరేపించాడని కూడా అతను చెప్పాడు.

Read Also: Mangaluru: కర్ణాటకలో ఉద్రిక్తత.. సుహాస్ శెట్టి తర్వాత మసీద్ సెక్రటరీ దారుణహత్య..

మహారాష్ట్రలోని సతారాలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సంతోష్, 2020లో రేణుకను వివాహం చేసుకున్నాడు. విజయపుర జిల్లాలోని చడచన్‌కు చెందిన రేణుక డాక్టర్. ఇద్దరు బాగా చదువుకున్నవారు, ఆర్థికంగా స్థిరమైన కుటుంబాలు. వీరి వివాహం తర్వాత నుంచే వివాదాలు ప్రారంభమయ్యాయి. కొన్ని ఏళ్లుగా ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. రేణుక ఆరోగ్యం, గర్భం దాల్చకపోవడంపై ఇరు కుటుంబాల మధ్య వివాదాలు జరుగుతున్నాయి.

సంతోష్ మరో వివాహం చేసుకోవడం, రెండో భార్య గర్భం దాల్చడం, హత్యకు చివరి కారణం కావచ్చని పోలీసులు చెబుతున్నారు. రేణుక కుటుంబం కట్నం, పిల్లలు లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని తెలుస్తోంది. ఆమె గర్భం దాల్చలేక పోవడంతో పదే పదే ఆమెను ఎగతాళి చేశారని, ఆమెకు “జ్ఞాపకశక్తి సమస్యలు” ఉన్నాయని ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. అయినప్పటికీ, రేణుక తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి రాలేదు మరియు తన అత్తమామలతో కలిసి జీవించడం కొనసాగించింది. హత్య, వరకట్న వేధింపుల కేసు నమోదు చేయబడి, ముగ్గురినీ ప్రస్తుతం హిండల్గా జైలులో ఉంచారు.

Exit mobile version