Site icon NTV Telugu

Ganja Case: ‘మత్తువదలరా’.. యూనివర్శిటీ క్యాంపస్‌లలోకి గంజాయి

Ganja Case

Ganja Case

Ganja Case: గంజాయి.. యువత జీవితాలను నాశనం చేస్తోంది. యూనివర్శిటీ క్యాంపస్‌లలోకి చొచ్చుకుపోయి.. స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతోంది. నిన్నటికి నిన్న మహేంద్ర యూనివర్శిటీలో బయటపడ్డ గంజాయి.. ఇప్పుడు హైదరాబాద్‌లోని మరో ప్రతిష్టాత్మక సంస్థలోకి చొచ్చుకుపోయింది. ప్రతిష్ఠాత్మక ICFAI సంస్థలో 8 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు యూనివర్శిటీల్లో ఏం జరుగుతోంది? ఇక్కడ చూడండి.. ఇది హైదరాబాద్‌లో ఉన్న ICFAI యూనివర్శిటీ. ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీగా ఇది సేవలందిస్తోంది. దీని కింద ICFAI బిజినెస్ స్కూల్స్ రన్ అవుతున్నాయి. వాటిల్లో మేనేజ్‌మెంట్, లా, టెక్నాలజీ కోర్సులు అందిస్తున్నారు. వేల మంది విద్యార్థులు ఈ ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీలో విద్య అభ్యసిస్తున్నారు..

READ ALSO: Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట

తాజాగా ఈ ICFAI సంస్థ పేరు మసకబారింది. ఇందులో చదువుతున్న 8 మంది విద్యార్థుల వద్ద గంజాయి లభించింది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ICFAI పక్కనే ఉన్న రిసార్టులో పార్టీ చేసుకుంటూ ఉండగా పోలీసులు సోదాలు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం 10 మంది పట్టుబడగా.. అందులోని 8 మంది ICFAIకి చెందినవారు.. మరో ఇద్దరు మహారాజుపేటకు చెందిన వాళ్లు ఉన్నారు. వాళ్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ICFAI కి చెందిన విద్యార్థులకు.. కొంపల్లికి చెందిన వర్షిత్ అనే విద్యార్థి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వర్షిత్‌తోపాటు మరో సీనియర్ స్టూడెంట్ గంజాయి తీసుకు వచ్చి విద్యార్థులకు సప్లై చేస్తున్నాడు. విద్యార్థుల వద్ద ఒక్కో గంజాయి సిగరెట్‌కు వేలల్లో డబ్బు తీసుకుంటున్నట్లు సమాచారం…

ఈ తరహాలో ICFAI సంస్థలో విద్యార్థులు మత్తులో జోగుతున్నారు. గంజాయికి అలవాటు పడి.. తమ తల్లిదండ్రులు పంపిన పాకెట్ మనీని గంజాయి ఎంజాయ్ చేయడం కోసం ఖర్చు చేస్తున్నారు. చదువును గాలికి వదిలేసి నిత్యం గంజాయి మత్తులోనే ఉంటున్నారని తెలుస్తోంది…

READ ALSO: Dharmavaram Murder: పడగ విప్పిన ఫ్యాక్షన్ .. ధర్మవరంలో అచ్చం సినిమా తరహా మర్డర్

Exit mobile version