Drunken Drive : SIని ఢీకొట్టి షాక్ ఇచ్చిన మందుబాబులు.. అంతటితో ఆగకుండా..!
- హైదరాబాద్.. యాచారంలో పరాకాష్టకు చేరిన తాగుబోతుల డ్రైవింగ్
- డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్సైని కారుతో ఢీకొట్టిన మందుబాబు
- ఎస్సై కారు బానెట్‌పై పడినా ఆపని మందుబాబు
- కొద్దిదూరం వెళ్లాక కారు స్లో కావడంతో దూకేసిన ఎస్సై
- స్వల్పగాయాలతో బయటపడ్డ ఎస్సై.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో డ్రంక్ డ్రైవింగ్ ఘటనలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. పోలీసుల కఠిన తనిఖీలు, భారీ జరిమానాలు, రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉన్నప్పటికీ, మద్యం సేవించి వాహనాలు నడిపే యువత దుశ్చర్యలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది.
యాచారం అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒక కారు వేగంగా వచ్చి తనిఖీల్లో ఉన్న ఎస్సైపై నేరుగా దూసుకెళ్లింది. ఢీకొన్న వేగానికి ఎస్సై కారు బానెట్‌పై పడిపోయాడు. అయితే షాక్‌కు గురైన ఎస్సైను బానెట్‌పై పెట్టుకుని కారు ఆగకుండా కొనసాగడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కారు కొంతదూరంలో వేగం తగ్గడంతో ఎస్సై దూకి బయట పడగా అతనికి స్వల్ప గాయాలయినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
ఈ ఘటనతో ఆగని డ్రైవర్, ముందుకు వెళ్తూ మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో ప్రజలు ఆగ్రహంతో కేకలు వేయగా, పోలీసులు వెంటనే కారు వెంబడి వెళ్లి ఆపడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఖానాపూర్ పోలీసులు ఇంటర్‌సెప్ట్ చేసి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారులో మరొక వ్యక్తి కూడా ఉండగా, ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
-
Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్‌లలో కీలక మార్పులు
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!