Site icon NTV Telugu

Suicide: తాగుడు మానేయమన్న భర్త.. మినీ ట్యాంక్ బండ్ లో దూకిన భార్య..

Suicide

Suicide

Suicide: గోల్నాకకు చెందిన భవాని అనే మహిళా, భర్తతో గొడవపడి సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గత రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. భవానికి చంపాపేట్‌కు చెందిన సాయికుమార్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భవానికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ అలవాటు కారణంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. మూడు నెలల క్రితం కూడా గొడవపడి భవాని పుట్టింటికి వెళ్లింది.

Mahavatar Narsimha : ఓటీటీలోకి మహావతార్ నరసింహా.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?

పెద్దల సమక్షంలో జరిగిన సంప్రదింపుల తర్వాత ఆమె తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. అయినప్పటికీ, ఆమె తన అలవాటును మానుకోలేదు. సోమవారం రాత్రి మరోసారి మద్యం సేవించి ఇంటికి రావడంతో భర్త సాయికుమార్ ఆమెను మందలించాడు. భర్త తిట్టడంతో మనస్తాపం చెందిన భవాని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్‌లో దూకినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Chitti Scam: కిలాడీ జంట.. చిట్టీల పేరుతో రూ. 30 కోట్లు పంగనామం!

Exit mobile version