పెళ్లి అంటే మనిషి జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక.. అందుకే ఉన్నంతలో చేసుకుంటున్నారు… ఇప్పుడు కూడా ఓ జంట అలానే పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాతే పెళ్లి కొడుక్కి అసలు ట్విస్ట్ ఎదురైంది..అయితే ఆ జంట కూడా పెళ్లిని ఘనంగా చేసుకుంది. ఆపై వధువు ఇంటి నుంచి వరుడి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వరుడి ఇంటికి చేరుకున్న తర్వాతి రోజు వధువు కడుపు నొప్పి వస్తుందని చెప్పింది. దీంతో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.. అది చూసిన బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది..
వివరాల్లోకి వెళితే..ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన వ్యక్తికి తెలంగాణలోని సికింద్రాబాద్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 26 సోమవారం రోజున సికింద్రాబాద్‌లో పెళ్లి ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతన వధూవరులు అత్తగారింటికి వెళ్లారు. ఆ తర్వాతి రోజు మంగళవారం వధువుకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. ఆమె గర్భవతి అని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారంతా నోరెళ్లబెట్టారు. ఆమె అప్పటికే ఏడు నెలల గర్భవతి అని చెప్పారు.. ఇక అప్పుడే వధువు ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. అది చూసిన వరుడు కుటుంబానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి..
ఆమె గర్భవతి అన్న విషయాన్ని దాచి పెట్టి అమ్మాయి కుటుంబం పెళ్లి పెళ్లి చేశారు.. దాని గురించి అడిగితే అమ్మాయికి రాళ్లు తీశారు అందుకే ఉందని బుకాయించారు..అయితే నవ వధువు ఆడ బిడ్డకు జన్మనిచ్చిందనే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. వారు సికింద్రాబాద్ నుంచి గ్రేటర్ నోయిడాకు చేరుకున్నారు. ఈ ఘటనపై రెండు కుటుంబాలు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే వరుడు అతని తల్లిదండ్రులు.. పుట్టిన బిడ్డను అంగీకరించకపోవడంతో శిశువును, నవ వధువును.. వారి కుటుంబం తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.. మొత్తానికి నిన్న పెళ్లి నేడు ప్రసవం తంతు సుఖాంతం అయ్యింది..