Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం
- దంపతుల మధ్య గొడవ
- భార్యను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ కలహాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. మనస్పర్ధల కారణంగా దాంపత్యంలో అలజడి రేగుతోంది. ఒకరినొకరు చంపుకునే వరకు పరిస్థితులు వెళ్తున్నాయి. హైదరాబాద్లో తాజాగా కుటుంబ కలహాల కారణంగా.. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపేశాడు. అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మహిళ పేరు సుమేరా. చాలా ఏళ్ల క్రితం రహీం అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ బాబు ఉన్నాడు. కూకట్పల్లి కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో కాపురం ఉంటున్నారు. రహీం క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు వారి కాపురం సజావుగానే సాగింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ వివాదాలు సైతం వారి కాపురంలో గొడవలకు కారణమయ్యాయి.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యపై తీవ్ర ఆవేశానికి లోనైన రహీం.. అత్యంత దారుణంగా సుమేరాపై దాడి చేశాడు. సుమేరా గొంతు కోసి హత్య చేశాడు. భార్య చనిపోవడంతో.. ఏం చేయాలో తోచని.. రహీం.. ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసే సరికి సుమేరా రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం పూర్తి చేయించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
సుమేరా తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రహీంను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్లతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారిద్దరి మధ్య కుటుంబ కలహాల కారణంగానే హత్య చేసి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. సుమేరాను అత్యంత దారుణంగా హత్య చేసిన రహీంను కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!