Site icon NTV Telugu

Hyderabad: భార్యపై అనుమానంతో.. అందరూ చూస్తుండగానే నరికి చంపిన భర్త..

Hyderabad

Hyderabad

Man Kills Wife : ఇప్పుడు దేశం మొత్తం ఒకటే ట్రెండ్ నడుస్తోంది. భర్తలను చంపడమే పనిగా పెట్టుకున్నారు భార్యలు.. అంతేకాదు పెళ్లి చేసుకున్న నెల రోజులకే భర్తలను తీసుకెళ్లి చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి భర్తలను ట్రాప్ చేసి మరీ కడతేర్చుతున్నారు. అయితే ట్రెండ్‌కు భిన్నంగా హైదరాబాద్‌లో ఒక ఘటన జరిగింది. మరో వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను చంపేశాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. ఓ వైపు మేనకోడలు కూతురు పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగానే.. భార్యను అందరి ముందే కర్కశంగా నరికి చంపేశాడు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్‌లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది..

READ MORE: PM Modi: అప్రూవల్ రేటింగ్స్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నరేంద్ర మోడీ..

సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ సమ్మక్క దంపతులు. సమ్మక్క అక్క కళావతితో శ్రీనివాస్‌కు గతంలో వివాహమైంది. శ్రీనివాస్​పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కళావతి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు, పెద్దలు మాట్లాడుకుని శ్రీనివాస్‌కు సమ్మక్కను ఇచ్చి​ రెండో వివాహం చేశారు. ఐతే వీరికి కూడా ఇద్దరు పిల్లలున్నారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో అనుమానం చిచ్చు పెట్టింది. సమ్మక్కపై శ్రీనివాస్‌కు అనుమానం పెరిగింది. మరో వ్యక్తితో భార్య సమ్మక్క చనువుగా ఉంటున్నట్లు గుర్తించి… నిత్యం గొడవ పడేవాడు. ఇలా కొన్ని రోజుల క్రితం చాలా గొడవలు జరిగాయి. ఇదే విషయం పై గత 15 రోజుల క్రితం సూర్యాపేటలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా చేశారు. ఆ తర్వాత సమ్మక్క హైదరాబాద్ వచ్చి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉంటోంది. శ్రీనివాస్ మేనకోడలయిన రాజేశ్వరి కూడా సమ్మక్క ఉండే బీసీ కాలనీలో నివాసముంటోంది.

READ MORE: Off The Record: సిల్లీ విషయంలో సీరియస్ గా తలబడ్డ ఇద్దరు పెద్ద నాయకులు?

రాజేశ్వరి కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా సమ్మక్కను వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజుకు ఇంటికి పిలిచారు. అందులో భాగంగా శ్రీనివాస్​, సమ్మక్క కూడా బర్త్​డేకు వచ్చారు. రాజేశ్వరి కుమార్తె కేక్​ కట్ చేసే క్రమంలో సమ్మక్క.. తన ఫోన్​లో​ వీడియోలు, ఫొటోలు తీస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాస్​ ఒక్కసారిగా సమ్మక్కపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క అక్కడే మృతి చెందింది. అనంతరం శ్రీనివాస్ అక్కడ నుండి సూర్యాపేటకు పారిపోయాడు. ఈ ఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమ్మక్క హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు. భర్త శ్రీనివాస్​ పరారీలో ఉన్నట్లు అబ్దుల్లాపూర్‌మెట్​ పోలీసులు తెలిపారు.

Exit mobile version