Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెల్ని పిండేసే ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. మానవత్వం అనే విషయాన్ని మంట కలుపుతూ కేవలం ఆరేళ్ల వయసున్న ఓ చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈవెంట్ కు తమన్ & దేవి శ్రీ డుమ్మా.. కావాలనే రాలేదా
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అందిన సమాచారం మేరకు నార్సింగిలో నివసించే ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. అయితే ఉనట్లుంది కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నారి అదృశ్యంపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
DME Fuel: వంట గ్యాస్ ధరలకు ఇక చెక్.. మార్కెట్లోకి భారత్ సొంత గ్యాస్! ఇక సామాన్యుడికి పండగే
రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి, తన వెంట తీసుకువెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తెలిపాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు చూపిన ప్రాంతంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వేగంగా విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!