Site icon NTV Telugu

Hawala Money : హైదరాబాద్‌లో హవాలా నెట్‌వర్క్ గుట్టురట్టు.. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న భారీ దందా..

Hawala

Hawala

భాగ్యనగరంలో అక్రమ నగదు రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గోషామహల్ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున హవాలా సొమ్ము పట్టుబడటం కలకలం రేపింది. బేగంబజార్‌లో డబ్బును డెలివరీ చేసేందుకు వచ్చిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ గొలుసుకట్టు అక్రమ లావాదేవీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఘుమఘుమలాడే ‘తలకాయ కూర’.. అమ్మ చేతి వంటలా రుచిగా రావాలంటే ఇలా చేయండి.!

గోషామహల్ పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారు ₹77 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బేగంబజార్ ప్రాంతంలో ఈ భారీ మొత్తాన్ని ఒకరికి అందజేసేందుకు వచ్చిన ముగ్గురు యువకులను పోలీసులు పక్కా సమాచారంతో మాటువేసి పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద ఉన్న నగదుకు సంబంధించి ఎటువంటి సరైన ఆధారాలు లేకపోవడంతో దాన్ని సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో వీరంతా హవాలా ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు తేలింది.

OnePlus ధమాకా..! రూ.16 వేలకే అదిరిపోయే ట్యాబ్.. మిస్ అవ్వకండి.!

ఈ హవాలా రాకెట్‌లో పోలీసులు గుర్తించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిందితుల వద్ద దొరికిన సగం చింపిన 10 , 20 రూపాయల నోట్లు. హవాలా లావాదేవీల్లో ఇవి ఒక రకమైన ‘టోకెన్’ లేదా ‘సీక్రెట్ కోడ్’గా పనిచేస్తాయని పోలీసులు వివరించారు. నగదు పంపిన వారు , స్వీకరించే వారు ఒకే సీరియల్ నంబర్ గల చింపిన నోట్ల ముక్కలను చూపించడం ద్వారా గుర్తింపును ధృవీకరించుకుంటారు. ఈ వింత పద్ధతి ద్వారానే ఎటువంటి చిరునామాలు లేకుండా కోట్ల రూపాయలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ హవాలా రాకెట్ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశ రాజధాని నుండి నగదును అక్రమ మార్గాల్లో నగరానికి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ముఖ్యంగా నగరంలోని పలువురు వ్యాపారవేత్తలు తమ అక్రమ వ్యాపార లావాదేవీల కోసం , పన్ను ఎగవేత కోసం ఈ హవాలా డబ్బును వాడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇతర ప్రధాన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.

రోజూ ఇవి తింటే చాలు! బెల్లీ ఫ్యాట్ & కొలెస్ట్రాల్ కి గుడ్‌బై!

Exit mobile version