Site icon NTV Telugu

Hyderabad family suicide: చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా?

09

09

Hyderabad family suicide: హైదరాబాద్ మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఫుడ్ పాయిజన్ కారణమా? అనేది తెలియాల్సి ఉంది. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్.. ఉపాధి కోసం ఫ్యామిలీతో హైదరాబాద్‌కు వచ్చాడు. అజీజ్‌నగర్‌లో నివాసం ఉంటూ మేస్త్రీ పని చేస్తూ ఉండే వాడు. కవితను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి రెండేళ్ల చిన్నారి కూతురు ఉంది. ఇక అనిల్.. అత్త, మామ కూడా వారితోనే ఉంటున్నారు. మియాపూర్‌లోని మక్త మహబూబ్‌పేటలో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాత్రి వరకు నవ్వుతూ మాట్లాడిన నలుగురు.. తెల్లవారేసరికి చిన్నారితో సహా గదిలో విగతజీవులుగా‌ పడి ఉన్నారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

పక్కింటి వాళ్లు తలుపు ఎన్ని సార్లు కొట్టినా తీయలేదు
గురువారం ఉదయం అనిల్.. మామ లక్ష్మయ్యకు బంధువులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో పక్కనే ఉన్న వాళ్లకు సమాచారం ఇచ్చారు. పక్కింటి వాళ్లు వచ్చి తలుపు ఎన్ని సార్లు కొట్టినా తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోపల చూడగా అనిల్, కవితతో పాటు రెండేళ్ల చిన్నారి కవిత తల్లి వెంకటమ్మ, తండ్రి లక్ష్మయ్య విగతజీవులుగా పడి ఉన్నారు.‌ అప్పటికే వారంతా చనిపోయినట్లు అనుమానించి వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూసేసరికే నలుగురు వాంతులు చేసుకున్నట్లుగా గదిలో కనిపించింది.. అనిల్‌కు ఆత్మహత్య చేసుకునే అంత అవసరం లేదని బంధువులు చెబుతున్నారు. అప్పులు ఉన్న మాట వాస్తవమే కానీ చనిపోయేంత అప్పులు లేవంటున్నారు. వారు అలా ఎలా చనిపోయారో అర్ధం కావడం లేదంటున్నారు.

కేసులో కీలకంగా మారిన పోస్టు మార్టం రిపోర్ట్
పోలీసులు.. ఐదుగురి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఫుడ్ పాయిజన్‌తో చనిపోయారా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది. ఒకవేళ ఫుడ్ పాయిజన్ ఐతే.. రెండేళ్ల చిన్నారి ఎంత తింటుంది? ఫుడ్ పాయిజన్ అయ్యేంత ఆహారం తీసుకుంటుందా? లేక చిన్నారిని చంపి నలుగురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు చాలా కీలకంగా మారింది.

Read Also: shocking crime: ఉల్లి తెచ్చిన లొల్లి.. తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

Exit mobile version