Double Fraud : సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు పేద, మధ్య తరగతి వర్గాల వారు నానా తంటాలు పడుతున్నారు. అదీ హైదరాబాద్ లాంటి నగరంలో అయితే వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. కనీసం ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్‌తోనైనా తమ కల సాకారం అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్లను ట్రార్గెట్ చేస్తూ కొంత మంది బ్రోకర్లు.. అందిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్ మేడిపల్లిలో అదే జరిగింది. సొంతింటి కోసం కలలు కంటున్న వారినే టార్గెట్ చేసే నాగరాజు.. మేడిపల్లి అమృత కాలనీలో ఉంటూ మోసానికి తెగబడ్డాడు.
Off The Record: టీడీపీ అధికారంలో ఉన్నా అక్కడ ఇంఛార్జ్ కరువా?
చాలా మందికి డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని ఆశలు కల్పించాడు. కేవలం రూ. 5 లక్షలు కడితే చాలు డబుల్ బెడ్ రూమ్ మీ సొంతమవుతుందని ఆశ చూపించాడు. ఇంకేముంది తన వద్దకు వచ్చిన జనాలకు నిలువునా కుచ్చు టోపీ పెట్టాడు. దాదాపు 100 మంది 5 కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. నాగరాజు దగ్గర 2, 3 ఏళ్ల క్రితం చాలా మంది బాధితులు డబ్బులు చెల్లించారు. వారు అడిగినప్పుడల్లా ఇదిగో అదిగో అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక లాభం లేదని అతన్ని గట్టిగా నిలదీసేందుకు బాధితులంతా నాగరాజు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో నాగరాజు ఇంట్లో లేకపోవడంతో గొడవ చేశారు. దీంతో పోలీసులు వచ్చి.. తమకు ఫిర్యాదు చేయాలని కోరడంతో మేడిపల్లి పీఎస్ కు వెళ్లారు.. అసలు డబుల్ బెడ్ రూమ్ కోసం ఇలా ఎవరిని పడితే వారిని నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. అర్హత ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తుందంటున్నారు.
AP Crime: కోట్లది రూపాయల మోసం.. వైసీపీ నేతపై పీడీ యాక్ట్, లుక్‌అవుట్ నోటీసులు జారీ
