Cyber Fruad: సైబర్ కేటుగాళ్లు చేస్తున్న అరాచకాలకు అంతే లేదు
- సైబర్ కేటుగాళ్లు చేస్తున్న అరాచకాలకు అంతే లేదు
- ఒంటరిగా ఉంటున్న ఆమెకు సైబర్ కేటుగాళ్ల కాల్
- మనీలాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసుల పేరుతో బెదిరింపు
- ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fruad: సైబర్ క్రిమినల్స్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించడంతో.. వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. తన తల్లి మృతికి సైబర్ నేరగాళ్లే కారణమని.. కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అమాయకులు, వృద్ధులు, మహిళలు.. ఇలా ఎవరు దొరికినా.. అందినకాడికి దోచుకుంటున్నారు. కేవలం ఒక్క ఫోన్ కాల్‌తో లక్షల రూపాయలు స్మార్ట్‌గా కొట్టేస్తున్నారు. కానీ ఒక్కోసారి వారు చేస్తున్న అరాచకాల వల్ల వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో సరిగ్గా ఇలాగే జరిగింది…
హైదరాబాద్‌లో ఉంటున్న ఓ మహిళా డాక్టర్.. వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లోనే ఉంటోంది. కొడుకు, కోడళ్లు, మనవళ్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఐతే ఒంటరిగా ఉంటున్న ఆమెకు సైబర్ కేటుగాళ్లు కాల్ చేశారు. వీడియో కాల్ ద్వారా.. తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. అంతే కాదు ఆమెపై మనీలాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయయ్యాని బెదిరించారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు వీడియో కాల్‌లోనే చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో మా వాళ్లు వచ్చి అరెస్ట్ చేస్తారని తెలిపారు..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఇలా ఆమెను మూడు రోజులపాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు సైబర్ క్రిమినల్స్. చివరకు తాము చెప్పిన విధంగా చేస్తే.. మీకు డిజిటల్ అరెస్ట్ నుంచి విముక్తి కల్పిస్తామని నమ్మబలికారు. ఆమె అది నమ్మడంతో తాము చెప్పిన విధంగా డబ్బులు చెల్లించాలని హుకుం జారీ చేశారు. వారు చెప్పిన అకౌంట్లకు డబ్బులు పంపించాలని చెప్పారు. ఈ మేరకు ఆమె.. వారు చెప్పిన అకౌంట్లకు 6 లక్షల 50వేల రూపాయలు పంపించింది. కానీ ఆ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా సైబర్ క్రిమినల్స్ వేధింపులు ఆపలేదు. మళ్లీ మళ్లీ డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు. ఇంకా డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది…
తల్లి మృతి విషయం తెలుసుకున్న కొడుకు.. హైదరాబాద్‌కు వచ్చి.. అసలు ఏం జరిగిందని ఆరా తీశాడు. దీంతో సైబర్ క్రిమినల్స్ అకౌంట్లకు డబ్బులు పంపిన విషయం బయటపడింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లి మృతికి సైబర్ చీటర్సే కారణమని ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని.. అలా ఎవరు చెప్పినా కచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనే అయి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సో బీ అలర్ట్.. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా కాల్ చేసి చెప్తే.. వెంటనే కాల్ కట్ చేయండి…
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!