Site icon NTV Telugu

Hyderabad Cyber Crime: ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో వరుడికి కుచ్చుటోపీ.. 25 లక్షలు గుంజిన సైబర్ దొంగలు

Cyber

Cyber

Hyderabad Cyber Crime: హైదరాబాద్ మహా నగరంలో మరోసారి సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనియల్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ వరుడిని మోసగించి రూ.25 లక్షలు వసూలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. khoobsurat.rishte అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా నిందితులు మ్యాట్రిమోనియల్ మోసాలకు పాల్పడ్డారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోలను ఉపయోగించి బాధితుడిని నమ్మించి, పెళ్లి పేరుతో భారీగా డబ్బులు తీసుకున్నారు. అయితే, ఈ మోసంలో అబ్దుల్ ఆమర్, అనీసా మొహమ్మద్యాసీన్ అనే ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో నిందితురాలు జోహర్ ఫాతిమా పరార్ అయిందని పోలీసులు చెప్పుకొచ్చారు.

Read Also: Sushila Karki: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ..

అయితే, నిందితుల దగ్గర నుంచి 2 ఫోన్లు, ల్యాప్‌టాప్, పాస్‌బుక్స్, చెక్‌బుక్స్, డెబిట్ కార్డులు లాంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మ్యాట్రిమోనియల్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులపై అప్పుడే నమ్మకంగా ఉండొద్దని సూచించారు.

Exit mobile version