NTV Telugu Site icon

Hyderabad :నార్సింగ్ లో దారుణం.. యువతి పై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

Narsing

Narsing

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ప్రభుత్వాలు మారే కొద్ది కొత్త చట్టాలు వస్తున్నాయి.. అయిన కూడా మహిళలు, యువతులు, చిన్నారులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.. నిన్న బోరబండ లో జరిగిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో దారుణ ఘటన నగరం నడిబొడ్డులో జరిగింది.. హత్యలు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. దారుణంగా యువతి గొంతు కోసాడు ఓ ప్రేమోన్మాది..

హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మొన్నటి వరకు పరువు హత్యలు భయపెడితే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జనాలను భయఆందోళనకు గురి చేస్తున్నాయి.. బోరబండ లో జరిగిన సీన్ రిపీట్ అయ్యింది.. యువతితో మాట్లాడాలని బలవంతంగా రప్పించాడు.. ఆ తర్వాత మాటకు మాట పెరగడంతో గొడవ ఎక్కువైంది.. దాంతో కోపంతో రగిలి పోయిన యువకుడు అమ్మాయిపై దాడి చేశాడు.. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తి తో పొడిచి అక్కడ నుంచి పారిపోయాడు..

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ నార్సింగ్ లో ఈ దారుణం జరిగింది..మాట్లాడాలని నార్సింగీ టీ గ్రీల్ హోటల్ వద్దకు పిలిపించిన యువకుడు.. మాటల మధ్యలో ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. ఒక్క సారిగా బ్యాగ్ లో ఉన్న కత్తితో పొడిచి పారిపోయాడు.. ఈ ఘటనలో యువతికి మెడపై, చేతుల కు తీవ్ర గాయాలు అయ్యాయి.. అది గమనించిన స్థానికులు యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.. కేసు నమోదు చేసుకొని యువతిని ఆసుపత్రికి తరలించారు..ఆంద్రప్రదేశ్ పిడుగురాళ్లకు చెందిన యువతి వాసవీ గా గుర్తించారు.. యువకుడు గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన గణేష్ గా గుర్తించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. యువకుడి ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు..

Show comments