ఈరోజుల్లో డబ్బుకు ఉన్న విలువ మానవ సంబంధాలకు లేవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. డబ్బు ముందు అయినవాళ్ళను కూడా లెక్కచేయ్యడం లేదు.. తాజాగా ఓ యువతి తన అవసరానికి రెండు వేలు డబ్బులను తీసుకుంది.. కానీ ఆ అవసరంను ఆసరాగా తీసుకొని ఓ వ్యక్తి అతి దారుణంగా మోసం చేశాడు.. ఆమెపై పలు మార్లు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా హైదరాబాద్ లో వెలుగు చూసింది.. స్నేహితుడిని నమ్మి నట్టేట్లో మునిగిన హైదరాబాద్‌కి చెందిన ఓ యువతి ఇప్పుడు లబోదిబోమంటోంది..
ఈ ఘటనపై పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా..హైదరాబాద్‌కి చెందిన యువతికి.. చెన్నైకి చెందిన పూర్ణేష్ యాదవ్‌కి.. 7 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమ దాకా వెళ్ళింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇటీవల తనకు డబ్బులు అవసరం ఉన్నాయంటూ చెన్నైలోని బాయ్‌ఫ్రెండ్ పూర్ణేష్ కోరడంతో.. ఆ యువతి తన స్నేహితుడైన అస్లాంను ఆశ్రయించింది. ఇదే అదనుగా భావించిన అస్లాం.. తన దగ్గర డబ్బుల్లేవనీ, అయితే తన స్నేహితుడు సాయిచరణ్ ఎంత కావాలంటే అంత డబ్బు నీకు ఇస్తాడు.. అయితే నువ్వు ఒకరోజు అతనితో గడపాలి అని కండిషన్ పెట్టాడు..
బాయ్‌ఫ్రెండ్ అడిగిన డబ్బులు సమకూర్చేందుకు తన స్నేహితుడు అస్లాం కండిషన్‌ని అంగీకరించి గతనెలలో నారాయణగూడలోని సిల్వర్ ఓక్ ఓయో రూమ్‌లో సాయి అనే యువకుడిని కలిసేందుకు వెళ్ళింది బాధిత యువతి. అప్పటికే పక్కా ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకున్న అస్లాం.. సాయితో కలిసి న్యూడ్ వీడియోలను తీసి బెదిరించడం మొదలు పెట్టాడు.. అడిగినప్పుడల్లా తనతో గడపాలని కోరింది.. ఇక ఎలాగో వీడియో తన బాయ్ ఫ్రెండ్ కు కనిపించింది.. తాను కూడా తన బందువులకు చూపిస్తానని చెప్తూ బెదిరిస్తున్నాడు.. ఒక్క రెండు వేలు ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది.. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని పెద్దలు ఊరికే చెప్పలేదు.. బీ కేర్ ఫుల్ మిత్రమా..