Site icon NTV Telugu

Husband Missing: పెళ్లయిన మూడు నెలలకే భర్త అదృశ్యం.. అసలేమైంది?

Husband Goes Missing

Husband Goes Missing

Husband Goes Missing After 3 Months Of Marriage In Hyderabad: ఆ జంటకు మూడు నెలల క్రితమే పెళ్లి అయ్యింది. వీరిని డిస్ట్రర్బ్ చేయడానికి గానీ, నెత్తి మీద భారాలు మోపడానికి గానీ.. వీరితో పాటు ఇంట్లో ఎవ్వరూ ఉండటం లేదు. కేవలం ఇద్దరే ఉంటున్నారు. పైగా.. హైదరాబాద్ నగరంలో కాపురం పెట్టారు. అలాంటప్పుడు.. ఈ దంపతులు ఎంత సంతోషంగా ఉండాలి? నచ్చిన ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేయడమే కాదు, హ్యాపీగా తమ దాంపత్య జీవితాన్ని లీడ్ చేయాలి. కానీ.. అందుకు భిన్నంగా ఈ నవ దంపతుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మొదటి కొన్ని రోజుల వరకు అన్యోన్యంగా ఉన్నారు కానీ, ఆ తర్వాతి నుంచే గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భర్త తన భార్యకు చెప్పకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Boora Narsaiah Goud: మోడీ కాదు.. ముందు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సోను అనే యువకుడు కొంతకాలం నుంచి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గుడ బస్తీలో ఉంటున్నాడు. ఇతడు ఒక ప్రైవేట్ ఉద్యోగి. మూడు నెలల క్రితం ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న షేక్ రోషిని (24) అనే అమ్మాయితో అతనికి వివాహం అయ్యింది. కట్ చేస్తే.. ఈనెల 5వ తేదీన ఆఫీసుకి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోను, అట్నుంచి అటే మాయమయ్యాడు. సాయంత్రం ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. భార్య రోషిని అతనికి ఫోన్ చేసింది. అయితే.. సోను ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో కంగారుపడ్డ రోషిని, తన భర్త కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆఫీస్ వాళ్లకు, అతని స్నేహితులకు ఫోన్ చేసి ఆరా తీసింది. కానీ.. ఎక్కడా సోను జాడ కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోని రోషిని.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

Rashid Latif: రెస్ట్ ఇన్ పీస్ పాకిస్తాన్ క్రికెట్.. మాజీ క్రికెటర్ సంచలనం

ఈ ఏడాది జనవరిలో తమకు పెళ్లి అయ్యిందని, నెల రోజులుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని రోషిని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ గొడవల కారణంగా.. తన భర్తకు రెండో పెళ్లి చేయాలని గుంటూరులో ఉంటున్న అతని తల్లిదండ్రులు చూస్తున్నారని తెలిపింది. భర్త కోసం తాను అన్ని ప్రాంతాల్లో వెతికానని, ఎక్కడా అతని జాడ తెలియరాలేదని తెలిపింది. తన అత్తమామల వద్దే తన భర్త ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version