NTV Telugu Site icon

Extramarital Affair: ‘అక్క’తోనే ఎఫైర్.. విషయం తెలిసి భర్త ఏం చేశాడంటే?

Bengaluru Wife Affair

Bengaluru Wife Affair

Extramarital Affair: ‘అక్క’ అని పిలుస్తూనే ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ విషయం తెలిసిన భర్త మనసు ముక్కలై ఏం చేయాలో తెలీక.. ఆ బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకి సమీపంలో చిక్కమారనహళ్లిలో నివాసం ఉంటున్న లోకేశ్ అనే వ్యక్తి 11 సంవత్సరాల క్రితం శశికళ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

varalakshmi Vratham: వ్రతం అప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చెయ్యాలి?

కట్ చేస్తే.. లోకేశ్‌కి చిరంజీవి అనే స్నేహితుడు ఉన్నాడు. కొంతకాలం నుంచి అతడు తరచూ లోకేశ్ ఇంటికి వస్తూ పోతుండేవాడు. తన ముందు ‘అక్క అక్క’ అంటూ శశికళను చిరంజీవి సంభోదించడంతో.. లోకేశ్‌కి ఎప్పుడూ అనుమానం కలగలేదు. అక్కాతమ్ముళ్లులాగా ఇద్దరు మెలుగుతున్నారని అనుకునేవాడు. తను ఇంట్లో లేనప్పుడు చిరంజీవి వచ్చినప్పుడు కూడా.. వారిపై అనుమానం వ్యక్తం చేయలేదు. కానీ.. ఒక రోజు శశికళ, చిరంజీవి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రాగా.. ఇంట్లో ఆ ఇద్దరిని సన్నిహితంగా మెలగడం చూసి ఖంగుతిన్నాడు. దాంతో.. అతడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

Ajith: చెన్నైలో అడుగుపెట్టిన తల… ఆగిపోయిన సినిమా

తన ముందు అక్కాతమ్ముళ్లులాగా నాటకమాడుతూ, తెరవెనుక ఇంత తతంగం నడిపించడం చూసి లోకేశ్ కుమిలిపోయాడు. ఏం చేయాలో తెలియక లోలోపలే రోధించాడు. చివరికి ఆ బాధని భరించలేక లోకేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య శశికళ చేసిన మోసాన్ని సూసైడ్ నోట్‌లో రాసి, ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Show comments