Crime News: దారుణం.. ఆ పనిచేసిందని.. భార్యను చంపి, ముక్కలు చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: అనుమానం.. ఒక పెనుభూతం. ఒక్కసారి మనిషి మెదడులోకి అనుమానం వచ్చిందంటే.. చచ్చేవరకు పోదు. ఆ అనుమానంతో ఏదైనా చేయడానికి రెడీ అవుతారు కొందరు. తాజాగా ఒక భర్త అనుమానం.. భార్య ప్రాణాలు తీసేసింది. ఆమె వేరొక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని అనుమానించిన భర్త.. ఆమెని అతి క్రూరంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్ ఘర్ లో వెలుగుచూసింది. భార్య మీద అనుమానంతో భర్త.. అతి క్రూరంగా చంపి, ముక్కలు ముక్కలు చేసి వాటర్ ట్యాంక్ లో పడేసిన ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తఖత్ పూర్ గ్రామానికి చెందిన పవన్ సింగ్ ఠాకూర్, సతీ సాహును కులాంతర వివాహ చేసుకున్నాడు. ఇక పెళ్లి తరువాత ఈ జంట ఉస్లాపూర్ లో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ఇక కొన్నేళ్లు బాగానే ఉన్న ఈ జంట మధ్య వివాదాలు నెలకొన్నాయి. చీటికీ మాటికీ ఇద్దరు గొడవలు పడుతుండేవారు. ఇక గత కొన్ని రోజుల నుంచి పవన్.. భార్య వేరొకరితో ఎఫైర్ పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై నిత్యం భార్యతో గొడవకు దిగేవాడు. ఇక కొన్నిరోజుల నుంచి సతీ ఇంట్లో కనిపించడం లేదు.. రెండు రోజుల నుంచి వారి ఇంటి పైకప్పు నుంచి దుర్వాసన రావడంతో అనుమానించిన పక్కింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ లో చూసి ఖంగుతిన్నారు. ఒక మహిళ శరీరం ముక్కలు ముక్కలుగా చేసి అందులో పడేశారు.. వెంటనే పోలీసులు మిగిలి ఉన్న శరీర ముక్కలను ల్యాబ్ కు పంపించగా వారు ఆమెను సతీ సాహుగా గుర్తించారు. ఇక భార్యను అతి క్రూరంగా చంపింది తన భర్తే అని పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించగా.. తన భార్య వేరొకరితో ఎఫర్ పెట్టుకుందని అనుమానం వచ్చిందని, దాని మీద ఇద్దరికీ గొడవ జరిగిందని.. ఆ కోపంలో భార్యను తానే హత్యచేసినట్లు చెప్పుకొచ్చాడు. ఎవరికి దొరకకుండా శవాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్ లో వేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతనిని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!