Hyderabad Crime: ఇంట్లో పనిచేస్తామంటారు.. నమ్మకంగా ఉంటామంటారు. వారి మాటలతో ఎదుటి వారిని మెప్పిస్తారు. ఇంటి పనికి ఒప్పుకుని ఇంట్లో వస్తువులపై నిఘా పెడతారు. సందుచూసుకుని అన్నీ దోచుకుని పరార్ అవుతారు. భార్య బాటలో భర్త.. భర్త అడుగు జాడల్లో భార్య అంటే ఇదే నేమో మరి. ఇద్దరు పనికి చేరి కొద్దిరోజులు నమ్మకంగా ఉండి ఇంట్లో వున్న సొత్తును మొత్తం దోచుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు. లబో దిబో మంటూ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సవాల్‌గా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలుగా మారి దోచుకుంటున్న భార్యాభర్తలను అదుపులో తీసుకున్నారు.
Read also: Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య..
రాజేంద్రనగర్, బండ్లగూడ, మ్యాపిల్ టౌన్షిప్ విల్లాలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ ముగ్గురి ఇండ్లలో చోరీకి పాల్పడింది దంపతులు అని అనుమానంతో ఆరా తీయగా పోలీసులకు నిర్ఘాంత పోయే నిజాలు బయట పడ్డాయి. రాజేంద్రనగర్‌లో కొండల్ రెడ్డి అనే వ్యక్తి డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన ఇంట్లో పనుల కోసం బీహారీకి చెందిన సలీం, జకియా సుల్తానాలను దంపతులు పని మనుషులుగా పెట్టుకున్నారు. కొద్ది రోజులు బాగానే నమ్మకంగా ఉండటంతో దీంతో వైద్యులు వారిని పూర్తీగా నమ్మాడు. ఇంత నమ్మకంగా వున్న బీహారీ దంపతులు దొంగతనం చేస్తారని ఊహించలేకపోయాడు. ఇదే అలుసుగా భావించిన బీహారీ దపంతులు ఒకరోజు దొంగతనానికి పాల్పడ్డారు.
Read also: Medak Tour: నేడు మెదక్ జిల్లాలో ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
ఒకటి కాదు రెండు కాదు ఇంట్లో మొత్తం వున్న రూ.45 లక్షల రూపాయల విలువైన డైమండ్ గొలుసు, బంగారు, వెండి ఆభరణాలతో పాటు 55వేల నగదును చోరీ చేసి పారిపోయారు. ఇంటికి వచ్చిన వైద్యుడు ఇంట్లో సొత్తు మొత్తం ఖాళీ అయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిని ఇంటికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే బీహారీ దొంగల కేసు దర్యాప్తులో వుండగా మరోవైపు పాతబస్తీలోని కాలపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు బీహారీ దంపతులను అదుపులో తీసుకున్నారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
వారి వద్ద నుంచి సుమారు 40 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. దంపతులను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో రాజేంద్రనగర్, బండ్లగూడ, మ్యాపిల్ టౌన్షిప్ విల్లాలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేధించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. వీరి ఇంకా ఎక్కడెక్కడ చోరీ చేశారనే దానిపై ఆరా తీస్తు్న్నారు. రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు. పనిలో పెట్టుకునే ముందు యజమానులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
PV Sindhu Reception: కనులవిందుగా సింధు, సాయి రిసెప్షన్.. అతిథులుగా అగ్ర తారలు!