Site icon NTV Telugu

East Godavari: భార్యను కాపురానికి పంపించని అత్తమామలు.. హతమార్చిన అల్లుడు!

Eg

Eg

East Godavari: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారి గూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపించడం లేదనే కోపంతో ఓ అల్లుడు తన అత్తమామలను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే, నల్లజర్లకు చెందిన ఏకుల బాబురావు, ఏకుల శారద దంపతుల ఇంటికి వారి అల్లుడు రామకోటేశ్వరరావు వచ్చాడు. భార్యను తనతో పాటు పంపించాలనే విషయంపై గొడవకు దిగిన అతడు తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావు, శారద అక్కడికక్కడే మృతి చెందారు.

Read Also: Neha Sharma : దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..

అయితే, రామకోటేశ్వరరావుకు 14 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగి, భార్య ఆయన నుంచి దూరంగా ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రామకోటేశ్వరరావు ఆయన భార్య ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతంలో నివసిస్తున్నట్లు సమాచారం. హత్య తర్వాత రామకోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని వదిలి వెళ్లకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన కొనసాగుతుంది.

Exit mobile version