East Godavari: భార్యను కాపురానికి పంపించని అత్తమామలు.. హతమార్చిన అల్లుడు!
- తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో దారుణం..
- భార్యను కాపురానికి పంపడం లేదని కక్షగట్టిన అల్లుడు..
- అత్తమామలపై కత్తితో దాడి చేసి హత్య చేసిన అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
East Godavari: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారి గూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపించడం లేదనే కోపంతో ఓ అల్లుడు తన అత్తమామలను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే, నల్లజర్లకు చెందిన ఏకుల బాబురావు, ఏకుల శారద దంపతుల ఇంటికి వారి అల్లుడు రామకోటేశ్వరరావు వచ్చాడు. భార్యను తనతో పాటు పంపించాలనే విషయంపై గొడవకు దిగిన అతడు తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావు, శారద అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: Neha Sharma : దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
అయితే, రామకోటేశ్వరరావుకు 14 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగి, భార్య ఆయన నుంచి దూరంగా ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రామకోటేశ్వరరావు ఆయన భార్య ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతంలో నివసిస్తున్నట్లు సమాచారం. హత్య తర్వాత రామకోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని వదిలి వెళ్లకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!