Honour killing: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమిస్తుందని కన్న తండ్రి కూతుర్ని చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రియుడిని కూడా దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మొరెనాలో జరిగింది. ఇద్దరు చనిపోయిన తర్వాత చంబల్ నదిలో ఇద్దరి మృతదేహాలను పారేశాడు. మొరేనా జిల్లా రతన్ బసాయి గ్రామానికి చెందిన శివాణి(18), సమీప గ్రామం బలుపురాకు చెందిన రాధేశ్యామ్ తోమర్(21) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శివాణి తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడు.
Read Also: PM Modi US Visit: మోడీ అమెరికా పర్యటనను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ కుట్ర.. టూల్ కిట్‌తో ఐఎస్ఐ ప్లాన్
నిందితుడు రాజ్ పాల్ విచారణలో తన కూతుర్ని, ఆమె ప్రేమికుడిని చంపేసినట్లు అంగీకరించాడు. మృతదేహాలను పడేసిన ప్రాంతాన్ని పోలీసులకు వెల్లడించాడు. జూన్ 3న శివాని అనే మహిళ తన ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. అయితే ఆమె తండ్రి ఏమీ తెలియనట్లుగా.. అంబాహ్ పోలీస్ స్టేషన్లో తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో శివాని ప్రేమికుడు ఛోటూ తోమర్ కూడా కనిపించకుండా పోవడంతో జూన్ 4న తోమర్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గతంలో మే నెలలో వీరిద్దరు ఇళ్ల నుంచి పారిపోయారు. వీరిని ఉత్తర్ ప్రదేశ్ లో గుర్తించిన పోలీసులు తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సారి కూడా పారిపోవచ్చని తోమర్ కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఈ నేపథ్యంలో వారిద్దరి హత్య జరిగి ఉండొచ్చనే విశ్వసనీయ సమాచారం కూడా వచ్చింది. నిందితుడు రాజ్ పాల్ ని అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. మృతదేహాల కోసం చంబల్ నదిలో వెతుకున్నారు.