Man Kills Daughter: పరువు హత్య.. కూతురు, ఆమె లవర్‌ను చంపేసిన తండ్రి..

  • గుజరాత్‌లో పరువు హత్య..
  • ప్రేమిస్తుందనే కోపంతో కూతురు, ఆమె లవర్‌ను చంపిన కుటుంబం..
Woman Kills Daughter

Woman Kills Daughter

Man Kills Daughter: గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిందనే కారణంతో కుమార్తెను, ఆమె లవర్‌ను తండ్రి దారుణంగా హత్య చేశారు. గత నెల రోజులుగా అదృశ్యమైనట్లు భావిస్తున్న ఇద్దరి మృతదేహాలు ఖంభాలా గ్రామంలోని ఒక బావిలో దొరికాయి. బాధితులిద్దరు కూడా ఫిబ్రవరి 3 నుంచి కనిపించడం లేదు. వీరిద్దరు అదృశ్యమైనట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే, పోలీస్ విచారణ తర్వాత యువతి కుటుంబ సభ్యులే వారిని హత్య చేసినట్లు తేలింది.

Read Also: Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

బాధితులను 19 ఏళ్ల నాథి(అలియాస్ సోను రబారి) , 21 ఏళ్ల నవీన్ జీవాభాయ్ రబారిగా గుర్తించారు. వీరిద్దరిపై నఖత్రాణా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. స్థానిక అధికారులు కేసును లోతుగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ తండ్రి తన కుమార్తె, నవీన్‌లో ప్రేమాయణం కొనసాగించడం ఇష్టం లేకే హత్య చేసినట్లు తేలింది. నవీన్‌తో సంబంధాన్ని తెంచుకోవాలని నాథిని పలుమార్లు కోరినప్పటికీ ఆమె వినకపోవడంతో ఇద్దరిని హత్య చేశాడు.

సంఘటన జరిగిన రోజున తండ్రి, అతడి మేనల్లుడు బైక్‌పై ఇద్దరిని ఖంభాలా గ్రామం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేలా చేశారు. అక్కడ మహిళ తల్లి, సోదరుడు కూడా ఉననారు. వీరంతా కలిసి ఇద్దరి గొంతులు నొక్కేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. నేరాన్ని దాచి పెట్టే ప్రయత్నంలో నిందితులు మృతదేహాలనున బావిలో విసిరేశారు. ఈ కేసులో తండ్రి, అతడి మేనల్లుడు, మహిళ మైనర్ సోదరుడు సహా నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.