బెంగళూరులో ఘోరం జరిగింది. వివాహిత అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై బంధువులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Collectors Conference: 11 గంటల పాటు సాగిన కలెక్టర్ల సదస్సు.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం
మమత (31) అనే మహిళ ఉత్తర బెంగళూరులోని బగలగుంటెలో నివాసం ఉంటుంది. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లోకేష్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గత కొద్ది రోజులుగా పాత స్కూల్‌మేట్స్ అశోక్, గణేష్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. దీంతో వారి వేధింపులు తాళలేక గత వారం ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు అశోక్, గణేషే కారణమంటూ కన్నడలో సూసైడ్ నోట్‌ను రాసింది.
ఇది కూడా చదవండి: Amaravathi: రెవెన్యూ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
‘‘నాకేదైనా జరిగితే అశోక్ మరియు గణేష్‌లే బాధ్యులు” అని నోట్‌లో మమత రాసింది. మాజీ సహచరుల నుంచి వేధింపులకు గురైనట్లు సూచించింది. పోలీసుల సమాచారం ప్రకారం.. అశోక్, గణేష్ అసభ్యకరమైన సందేశాలు పంపడం మరియు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం డిమాండ్ మరియు మమత కుటుంబ జీవితానికి అంతరాయం కలిగించే ప్రయత్నాలు ఉన్నాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
లోకేశ్.. తన భార్య ఫోన్ స్పందించకపోవడంతో పొరుగువారికి సమాచారం ఇవ్వడంతో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూడగా ఇంట్లో మమత ఉరివేసుకుని ఉంది. బిడ్డ నిద్రిస్తున్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Mamata banerjee: బంగ్లాదేశ్ విషయంలో మోడీ సర్కార్ నిర్ణయాలకు మద్దతుగా ఉంటాం