NTV Telugu Site icon

Nalgonda Crime: నవీన్ హత్య కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు.. వెలుగులోకి సంచలన విషయాలు

Harihara Krishna Statement

Harihara Krishna Statement

Harihara Krishna Statement In Naveen Case: తన స్నేహితుడు నవీన్‌ను అత్యంత దారుణంగా చంపిన హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్ స్టేషన్‌లో ఈ FIR నమోదైంది. నిందితుడు హరిహర కృష్ణపై సెక్షన్ 302, 201 ఐసీపీ, 5(2) (V), SC, ST, POA act 2015 సెక్షన్‌ల కింద కృష్ణపై కేసులు పెట్టారు. ముసారాంబాగ్‌కు చెందిన కృష్ణ.. తనంతట తానే పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే అతడు సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు కీలక విషయాల్ని పొందుపరిచారు. కృష్ణ ఇచ్చిన వాంగ్మూలం ఏమిటంటే..

Virupaksha: యాక్సిడెంట్ తర్వాత డూపు లేకుండా బైక్ స్టంట్ చేసిన సుప్రీమ్ హీరో

‘‘నవీన్, నేను (హరిహర కృష్ణ) దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. ఆ సమయంలోనే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి నాకు దూరం అయ్యింది. దీనినే నవీన్ తనకు అనుకూలంగా మార్చుకొని, ఆ అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి కూడా నవీన్‌తో క్లోజ్‌గా మెలిగింది. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను. దీంతో నవీన్‌ని చంపేందుకు మూడు నెలలుగా ప్లాన్ చేశాను. సమయం కోసం వేచి చూశాను. ఫిబ్రవరి 17వ తేదీన నేను, నవీన్ కలిసి కొన్ని ప్రాంతాలకు తిరిగాం. ఆ తరువాత మూసారాంబాగ్‌లోని మా ఇంటికి చేరుకున్నాం. అక్కడి నుంచి తాను ఇంటికి వెళ్తానని నవీన్ చెప్పడంతో.. హోండా షైన్ బైక్ మీద ఇద్దరం కలిసి బయలుదేరాం. పెద్ద అంబర్‌పేట్‌కి చేరుకున్నాక, మా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను నవీన్‌ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కత్తితో దాడి చేశాను’’ అని చెప్పాడు.

Nalgonda Crime: నవీన్ హత్య కేసులో ట్విస్ట్.. ‘గుడ్ బాయ్’ అంటూ అమ్మాయి రిప్లై

తన ప్రియురాలిని ప్రేమించిన కోపంలో నవీన్ ప్రైవేట్ భాగాలను తాను కోశానని.. అలాగే గుండె, తల, చేతి వేళ్ళు, చేతులు, ఇంకా మిగతా భాగాల్ని కత్తితో వేరు చేశానని కృష్ణ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అనంతరం అక్కడి నుంచి తాను పారిపోయానని తెలిపాడు. అతడు ఇచ్చిన ఈ వాంగ్మూలం ఆధారంగా.. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. నవీన్ హత్య విషయాన్ని ఆ అమ్మాయికి కృష్ణ ఫోన్ చేసి తెలియజేసినట్టు విచారణలో తేలింది. అంతేకాదు.. నవీన్ శరీర భాగాల ఫోటోలను పంపగా.. అవి చూసి ‘గుడ్ బాయ్’ అంటూ ఆ అమ్మాయి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో.. ఆ అమ్మాయిని కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చబోతున్నారు.