Harihara Krishna Message To His Lover About Naveen Death: తాను ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో.. తన స్నేహితుడైన నవీన్‌ని హరిహర కృష్ణ అత్యంత దారుణంగా చంపిన ఘటన తెలిసిందే! ఇంటర్ చదువుకున్న రోజుల్లో ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం, ఆ అమ్మాయి నవీన్‌కి సొంతం అవుతుందన్న భయంతో.. కృష్ణ ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఈ కేసులో తాజాగా ఓ ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తాను నవీన్‌ని ముక్కలు ముక్కలుగా నరుకుతూ.. ఆ భాగాల ఫోటోలను పంపిన మెసేజ్‌లకు అమ్మాయి ‘గుడ్ బాయ్’ అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే.. నిందితురాలిగా ఆ అమ్మాయిని కూడా చేర్చబోతున్నట్టు తెలిసింది.
Charan: టామ్ క్రూజ్ లాంటి వాళ్లతో ఎన్టీఆర్ పేరు, నా పేరు ఉండడం గర్వంగా ఉంది
తొలుత నవీన్‌ని హత్య చేశాక.. ఈ విషయాన్ని అమ్మాయికి ఫోన్ చేసి హరిహర కృష్ణ చెప్పాడు. అంతేకాదు.. మెసేజ్‌లో కూడా నవీన్ హత్య విషయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత ఒక్కో భాగం కోస్తూ.. ఆమెకు ఫోటోలు పంపాడు. ‘ఈ వేలే కదా నిన్ను తాకింది, ఇదిగో వేలు’ అంటూ నవీన్ వేలు కోసి ఆ ఫోటోని అమ్మాయికి పంపించాడు. అనంతరం.. ‘ఈ పెదాలే కదా నిన్ను తాకింది’ అంటూ పెదాలు కోసి ఆ ఫోటో మెసేజ్ చేశాడు. ‘ఈ గుండె కదా నిన్ను తాకింది’ అంటూ గుండెను కోసి, ఆ పిక్‌ని అమ్మాయికి ఫోన్‌కి పంపాడు. చివరకు నవీన్ తలని కోసి, దూరంగా వేశాడు. చివరికి నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు. ఇలా ఒక్కో భాగం కోస్తూ.. చాలా దారుణంగా మెసేజ్ పంపించినట్లు తేలింది.
Kodali Nani: ఎన్టీఆర్ కి పార్టీ ఇచ్చేసి చంద్రబాబు, లోకేష్ తప్పుకోవాలి
షాక్‌కి గురి చేసే విషయం ఏమిటంటే.. ఆ మెసేజ్‌లకు ఏమాత్రం భయపడకుండా సింపుల్‌గా రిప్లై ఇచ్చింది. ‘అవునా, ఓకే వెరీ గుడ్ బాయ్’ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో.. అమ్మాయిపై అనుమానంతో ఆమెను నిందితురాలిగా చేర్చబోతున్నారు. నవీన్ హత్యలో అమ్మాయి హస్తం కూడా ఉందా? లేదా? అనే కోణంపై విచారిస్తున్నారు. మరోవైపు.. హరిహర కృష్ణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అతడు సైకో (అమ్మాయికి అతడు పంపిన మెసేజ్‌తోనే అర్థం చేసుకోవచ్చు) అని తెలుస్తోంది. అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నట్టు కూడా తేలింది. నవీన్ హత్యకు కృష్ణ ముందునుండే ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.