Tragedy: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. భుజ్-ఖావ్డా జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కచ్ జిల్లాలోని వెకారియా రణ్ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అంతేకాకుండా పల్టీలు కొట్టడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది.
ప్రమాద తీవ్రత కారణంగా ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటంతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదానికి గురైన వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. సదరు జవాన్ భుజ్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే మృతుల పూర్తి వివరాలు, వారి పేర్లు, ప్రమాదానికి సంబంధించిన ఇతర అంశాలపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై కూడా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

