Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..

  • మద్యానికి బానిసైన కొడుకు..
  • యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు..
  • ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..
Crime News

Crime News

Parents Kill Son: తల్లిదండ్రులు కొడుకును చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్‌కోట్ జిల్లా, గోండల్ తాలూకాలోని గుండాలా గ్రామంలో జరిగింది. మద్యపానం అలవాటు కారణంగానే తల్లిదడ్రులు కొడుకును చంపినట్లు తేలింది. జూన్ 30న హత్య చేసిన తర్వాత, దీనిని ఆత్మహత్యగా మార్చాలని ప్రయత్నించారు, అయితే పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య అని బయటపడింది.

మృతుడిని 25 ఏళ్ల రామ్ బాబుభాయ్ బాంభవాగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతుడి భార్య అత్తామామలపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ ప్రచారం, రామ్ తీవ్ర మద్యపానం అలవాటు ఉంది. దీని వల్ల ఇతను తన తండ్రి బాబూ భాయ్, తల్లి మనీషా బెన్‌లతో తరుచూ గొడవ పడుతుంటేవాడు. సంఘటన జరిగిన రోజు మళ్లీ గొడవ జరిగింది. వివాదం ముదరడంతో తల్లి రామ్‌కు బలవంతంగా యాసిడ్‌ను తాగించిందని, తండ్రి అతన్ని కొట్టి ఆపై గొంతు నులిమి చంపేసినట్లు తేలింది.

దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు స్థానిక రాజకీయ పలుకుబడిని వాడేందుకు బాబు భాయ్ ప్రయత్నించాడు. ఎవరీకి అనుమానం రాకుండా గోండల్ సివిల్ ఆస్పత్రికి తరలించి, త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే, పోలీసులు సమగ్ర దర్యాప్తు , పోస్టుమార్టం నివేదిక తర్వాత హత్యగా తేల్చారు. బాధితుడి భార్య బన్షీబెన్ భవ ఇచ్చిన ఫిర్యాదుతో గోండల్ పోలీసులు ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.