NTV Telugu Site icon

Crime: దారుణం.. పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో మాజీ సైనికుడిని కొట్టి చంపిన మనవడు

Ex Soldier

Ex Soldier

చైనా, పాకిస్థాన్ సైనికులను మట్టుబెట్టిన మాజీ సైనికుడిని కొట్టి చంపాడు. 93 ఏళ్ల వృద్ధుడు తన మనవడికి పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన మనవడు తాతను కర్రతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఢిల్లీ పరిధిలోని ఆజాద్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వృద్ధుడు హవల్దార్ భోజరాజ్‌ 1962లో చైనా, 1965లో పాకిస్థాన్‌పై పోరాడిన యోధుడు. ఆయన ఆర్మీలో ఎనలేని సేవ చేశారని స్థానికులు చెబుతున్నారు. 1985లో పదవీ విరమణ చేసిన తర్వాత ఆజాద్‌పూర్ గ్రామంలో నివసిస్తున్నారు.

READ MORE: Onion Price: భారీగా పెరిగిన ఉల్లి ధర?.. కారణం ఇదే

బుధవారం తనకు పింఛను డబ్బుు పడ్డాయి. వృద్ధుడైన భోజరాజ్ తన పింఛనులో సగం తన చిన్న కొడుకు జైవీర్‌కి, మిగిలిన సగం మనవడు ప్రదీప్ మొదటి భార్యకు ఇచ్చేవారు. అయితే ప్రదీప్ తన భార్యకు ఇచ్చిన వాటా తనకు దక్కాలని కోరుకున్నాడు. ఈ విషయమై తాత, మనవడి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వమని మనవడు ఒత్తిడి తెచ్చాడు. పింఛను ఇవ్వడానికి హవల్దార్ భోజరాజ్‌ నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన మనవడు తాతను కర్రతో బలంగా కొట్టాడు. గాయపడిన రిటైర్డ్ సైనికుడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

READ MORE:Haryana: బీజేపీ తొలి జాబితా విడుదల.. సీఎం సైనీ పోటీ ఎక్కడనుంచంటే..!

క్రూరంగా ప్రవర్తించిన నిందితుడు..
ప్రదీప్ మొదట తన తాత బట్టలు తొలగించి, ఆపై కర్రతో కొట్టడం ప్రారంభించాడని, అతను స్పృహ కోల్పోయాడని స్థానికులు ఆరోపించారు. బాధితుడు భోజరాజ్ చిన్న కుమారుడు జైవీర్ తన తండ్రిని అలాంటి స్థితిలో చూడగానే.. చలించిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు ప్రదీప్ పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Show comments