NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో దారుణం.. బాలుడిపై లైంగిక వేధింపులు.. స్థానికుల ఆందోళనతో ఉద్రిక్తత

Delhiboy

Delhiboy

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. గోవింద్‌పురిలో ఐదేళ్ల బాలుడిపై పొరుగింటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఈ విషయాన్ని బాలుడు.. తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పారామిలటరీ బలగాలు మోహరించాయి. ఇక పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

సెప్టెంబరు 1న ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో ఐదేళ్ల బాలుడిపై పొరుగింటి వ్యక్తి బలరామ్ దాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఐదేళ్ల చిన్నారిని ప్రలోభపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. కొన్ని గంటల తర్వాత బాలుడిని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని చెప్పారు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పెద్ద ఎత్తున ప్రజలు మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ ముట్టడించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రహదారిని మూసేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వచ్చి నచ్చజెప్పినా నిరసనకారులు శాంతించలేదు. దీంతో పారామిలటరీ బలగాలు మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు.

ఇది కూడా చదవండి: Fact Check: ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ‘పోర్న్ లెటర్’.. స్పందించిన ప్రభుత్వం

ఇక నిందితుడు బలరామ్‌ దాస్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా స్థానికులు పెద్దఎత్తున గుమిగూడి నిందితుడు, పోలీసులపై దాడికి యత్నించారు. అయితే పోలీసులు తప్పించుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నిరసనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం గోవింద్‌పురి పోలీస్ స్టేషన్ దగ్గర పారామిలటరీ బలగాలు మోహరించి ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Bandi Sanjay : పవర్ లూం క్లస్టర్ ను మంజూరు చేయండి.. పావులా వడ్డీకే రుణాలందించండి

బాలుడిని పోలీసులు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. అనంతరం లజ్‌పత్‌నగర్‌లోని కేర్‌హోమ్‌కు తరలించారు. ఇక మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట బాలుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని బాలుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియజేశాడు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: అంతా బుడమేరుతోనే.. కబ్జాలు తొలగిస్తాం..

Show comments