Brother Murders Sister: దారుణం.. లవర్ తో కనిపించడంతో.. సొంత చెల్లెలినే..
- చెల్లెలిని కాలువలో ముంచి చంపిన అన్న
- అనంతరం స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత చెల్లెలిని కాలువలో ముంచి చంపాడు అన్న. తన చెల్లెలి ప్రేమ వ్యవహారంతోనే ఈ హత్యజరిగినట్లు సమాచారం. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
Read Also:Shocking Video: మరీ ఇలా తయారయ్యారేంటమ్మా.. అత్తపై కోడలు దాడి
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా కాంపియర్గంజ్లోని భౌరబారి గ్రామంలో ఆదిత్య యాదవ్ అనే యువకుడు తన సొంత చెల్లె అయిన నిత్య యాదవ్ ను నీటిలో ముంచి హత్య చేశాడో అన్న. తన చెల్లెలు ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడపడమే ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. గతంలో సోదరికి ఎన్నో సార్లు చెప్పి చూసిన వినక పోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు ఆదిత్య.
Read Also:Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై వదిలేశాడు..
నిందితుడు ఆదిత్య యాదవ్ సోమవారం తన 19 ఏళ్ల సోదరి నిత్య యాదవ్‌ను హత్య చేశాడు. నిత్య ఇంటర్మీడియట్ విద్యార్థిని. గత మూడు సంవత్సరాలుగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ విషయం కాస్త ఆదిత్య యాదవ్ కు తెలియడంతో.. నిత్య యాదవ్ నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె తన మాట వినలేదు. ఆదివారం నిత్య యాదవ్ ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. రాత్రి అయినప్పటికి తను ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కలా అంతా వెతికారు. సోమవారం ఉదయం ఆమె ఓ యువకుడితో రెస్టారెంట్ లో కనిపించింది.
మొదట ఆదిత్య తన చెల్లెలిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె మాత్రం యువకుడిని వదిలి రానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమెను మాట్లాడదామని ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను కొట్టి.. అనంతరం కాలువలో ముంచి చంపేశాడు. హత్యానంతరం.. ఆదిత్య మృతదేహం ముందు దాదాపు గంటన్నరకు పైగా కూర్చున్నాడు. తర్వాత పీఎస్ కు వెళ్లి.. తాను తన చెల్లెలిని హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు.
Read Also:Delhi: విదేశీ కోచ్‌లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్
నిందితుడు నేరం అంగీకరించాడని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రోషన్ సింగ్ తెలిపారు. తన తండ్రి మరణం తర్వాత, తన సోదరీమణులు. తమ్ముడిని చూసుకుంటూ, కూలీగా పనిచేస్తున్నానని ఆదిత్య తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం బిఆర్‌డి మెడికల్ కాలేజీకి పంపారు .. అనంతరం కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!