Good Thief: దొంగల చేతిలో ఓ సారి సొత్తు పడిందంటే చాలు.. అది మాయం కావాల్సిందే.. తిరి వచ్చే పని ఉండదు.. అయితే, అప్పడప్పుడు మంచి దొంగలను కూడా చూస్తూ ఉంటాం.. చిన్న చిన్న వస్తువులు తీసుకెళ్లి.. విలువైన వస్తువుల జోలికి వెళ్లనివారు కూడా ఉంటారు.. అయితే, తాజాగా ఓ దొంగ ఎత్తుకెళ్లిన బంగారాన్ని తిరిగి ఇచ్చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది..
Read Also: Off The Record: ఏపీ బీజేపీ స్వరం మారుతోందా?
విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వంగర మండలం బాగెంపేటలో గత నాలుగు రోజుల క్రితం శంకర్రావు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చోరీ జరిగింది.. ఈ ఘటనలో 20 తులాల బంగారం అపహరణకు గురైంది.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఇంతలో అజ్ఞాత వ్యక్తి నుంచి ఇంటి యజమానికి ఫోన్ వచ్చింది.. తన ఇంటి వెనక ఉన్న స్కూటీలో మీ బంగారం ఉందని.. తనపై కేసు వాపస్ తీసుకోవాలంటూ ఫోన్ చేసి చెప్పాడు.. దీంతో, కొంత ఆశ్చర్యానికి గురైన సదరు వ్యక్తి.. అందరి సమక్షంలో ఇంటి యజమాని స్కూటీ డిక్కీలో చూడగా బంగారం దొరికింది.. దీనిపై వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు.. అయితే, అందులో ఒక నల్లపూసల తాడు, ఉంగరం తప్ప మిగతా అన్ని బంగారు నగులు ఉన్నాయి అని పోలీసులకు తెలిపారు ఇంటి యజమాని.. అయితే, ఇది తెలిసిన వారు చేశారా? బయటి వారు చేశారా? తిరిగి ఎందుకు మళ్లీ ఆ సొత్తును అప్పగించారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
