రోజురోజుకు మానవ సంబంధాలు చచ్చిపోతున్నాయి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే అస్సలు వీరికి మానవత్వం ఉందా అనిపించక మానదు. అక్కాచెల్లి, తల్లితండ్రి ఇలాంటి సంబంధాలకు విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. తాజాగా ఒక అక్క.. తన స్వార్థం కోసం చెల్లిని బలిచేసింది. ప్రియుడి ఇచ్చే డబ్బు, ఫోన్ కి ఆశపడి ముక్కుపచ్చలారని బాలికను ఒక మృగం చేతికి అప్పగించింది. ఆ కామాంధుడు బాలిక అని కూడా చూడకుండా ఆమెను అతి దారుణంగా అత్యాచారం చేసి.. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడే పరిస్థితి తెచ్చాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బషీర్ హట్ సబ్ డివిజన్ కు చెందిన ఒక యువతి, గత కొన్నేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. అయితే అతడు.. ప్రేయసికి వరుసకు చెల్లెలు అయ్యే పదకొండేళ్ల బాలికపై కన్నేశాడు. ఈ విషయాన్ని ప్రేయసికి చెప్పి ఒక రాత్రంతా నీ చెల్లితో గడిపే అవకాశం ఇవ్వమని అడిగాడు. అందుకు ఆమెకు కొంత డబ్బు, ఫోన్ ఇచ్చాడు. డబ్బు ఆశతో అక్క,ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రియుడిని చెల్లి దగ్గరకు పంపింది. ఇక ఆ బాలిక మీద కన్నేసిన ఆ క్రూర మృగం అత్యంత కిరాతకంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిర్భయ ఘటన కన్నా దారుణంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలిక మృతిచెందిందేమో అన్న భయంతో ఆ కామాంధుడు బాలికను అక్కడే వదిలి పారిపోయాడు. ఇక కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతుకుతుండగా అక్క ఇంట్లో నగ్నంగా, అపస్మారక స్థితిలో బాలిక కనిపించడంతో తల్లిదండ్రుల గుండె బద్దలయ్యింది. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంతటి దారుణానానికి పాల్పడిన బాలిక అక్క, ప్రియుడు పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడును పోలీసులు అరెస్ట్ చేశారు.