Crime: 13 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి దారుణం..
- ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం..
- 13 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారం..
- 5 నెలల గర్భవతి అని తేలడంతో విషయం వెలుగులోకి..
- పోక్సో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కోల్‌కతా డాక్టర్ ఘటన ఇప్పటికే దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలోనే పలు ప్రాంతాల్లో బాలికలు, మహిళలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. చాలా వరకు లైంగిక దాడులు తెలిసిన వారి నుంచే జరుగుతున్నాయి.
Read Also: Gaza War: ఆరుగురు ఇజ్రాయిలీ బందీలను హత్య చేసిన హమాస్..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ ఫరూఖాబాద్‌లో 13 ఏళ్ల బాలికపై ప్రభుత్వ పాఠశాల ప్యూన్, అతడి సహచరుడు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఐదు నెలల తర్వాత బాలిక గర్భవతి అని తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితం బాలిక రాత్రి వాష్‌రూమ్‌కి వెళ్లిందని, పాఠశాలలో పనిచేసే పంకజ్ మరియు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అమిత్ ఆమెను పట్టుకుని, ఖాళీగా ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అమిత్ బాలికపై అత్యాచారం చేయగా, పంకజ్ బయట కాపలాగా ఉన్నాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను నిందితులు బెదిరించారు. అయితే, శనివారం రోజు బాలిక ఐదు నెలల గర్భవతి అని తల్లి గుర్తించడంతో విషయం తెలిసింది. నిందితులపై అత్యాచారం ఆరోపణలతో పాటు లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!