Site icon NTV Telugu

Ganja Biscuits: గంజాయి బిస్కెట్ల కలకలం.. జైలులో ఉన్న అన్నకు పంపి జైలుపాలైన తమ్ముడు..

Ganja Biscuits

Ganja Biscuits

అన్న కోసం కొందరు తమ్ముళ్లు ఏది చేసేందుకైనా సిద్ధపడతారు.. ఆస్తులు త్యాగం చేసేవాళ్లు కొందరైతే.. అన్నపై ఈగ కూడా వాలకుండా చూసుకునేవారు మరికొందరు.. అయితే, జైలులో ఉన్న తన అన్న కోసం ఏకంగా గంజాయి బిస్కెట్లు తయారు చేసి.. అన్నను ములాకత్‌లో కలిసి పరామర్శించి.. తాను తయారు చేసి గంజాయి బిస్కెట్లను అన్నకోసం పంపించి అడ్డంగా దొరికిపోయాడు ఓ తమ్ముడు.. చివరకు అరెస్టై.. అన్న ఉన్న జైలులోనే ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది..

Read Also: Gujarat Assembly elections: 160 మంది బీజేపీ తొలి జాబితా.. రవీంద్ర జడేజా భార్య, హార్దిక్‌ పటేల్‌కు ఛాన్స్‌

తమిళనాడులో కలకలం సృష్టిస్తోన్న గంజాయి బిస్కెట్లకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్న కోసం గంజాయి బిస్కెట్లు తయారు చేశాడు ఓ తమ్ముడు.. దొంగతనం కేసులో అరెస్టై.. సేలం జైలులో శిక్ష అనుభవిస్తున్న కార్తీక్‌ అనే యువకుడి కోసం గంజాయి బిస్కెట్లు తయారు చేశాడు.. అంటే.. సాధారణంగా క్రీమ్‌ బిస్కెట్లలో క్రీమ్‌ ఉంటుంది.. కానీ, మనోడు.. ఆ క్రీమ్‌ను తొలగించి.. ఆ ప్లేస్‌లో గంజాయి నింపేశాడు.. వాటిని అన్నను చేరవేయాలని ప్లాన్ చేశాడు.. బిస్కెట్‌ ప్యాకెట్‌ను యథావిథిగా ప్యాక్‌ చేశాడు.. వాటిని తీసుకుని సేలం సెంట్రల్ జైలుకు వెళ్లాడు.. జైలులో ఉన్న కార్తీక్‌ను పరామర్శించాడు.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గంజాయి బిస్కెట్లను జైలులోకి పంపించే ప్రయత్నం చేశాడు.. ఏదైనా చెక్‌ చేసిన తర్వాతే జైలులోకి పంపే అధికారులు.. తమ తనిఖీల్లో బిస్కెట్లలో గంజాయిని గుర్తించారు.. పోలీసులకు సమాచారం చేరవేశారు.. ఇక, కార్తీక్‌ తమ్ముడిని కూడా అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అదే జైల్లో పెట్టారు..

Exit mobile version