AP Crime: రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియంలో వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి.. గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే, ఆమె పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది.
Read Also: Matangi : ఇండియన్ నేవీకి కొత్త ఆయుధం.. సిబ్బంది లేకుండా 600కి.మీ ప్రయాణించిన ‘మాతంగి’
పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత అత్యాచారం, హత్య కేసుగా నమోదు చేసిన కడియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుర్రిలంకకు చెందిన దేవర యేసులోకి జయప్రసాద్, వెలుబుడి ప్రవీణ్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్‌ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా మద్యం మత్తులో ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేసి ఆ తర్వాత హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుపై మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. చొప్పెల్ల లాకులు వద్ద మృతదేహం లభించాక అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారించడంతో.. కామాంధుల డొంక కదిలింది. దీనిపై అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపంగా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. భర్త ఫిర్యాదుపై మొదట మిస్సింగ్ కేసు, మృతదేహం లభించిన తర్వాత అనుమానస్పద మృతి కేసు, పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత హత్య కేసుగా నమోదు చేసి కడియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.