Crime: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం జరిగింది. ఒక యువకుడు తన భార్యను ముగ్గురు వ్యక్తులతో అసభ్యకరమైన స్థితిలో చూశానని చెప్పి, పెళ్లైన నాలుగు నెలలకే ఆమె గొంతు నులిమి హత్య చేశాడని అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయినట్లు తెలుస్తోంది. నిందితుడిని సచిన్ సింగ్‌గా గుర్తించారు. అతడి భార్య శ్వేతా సింగ్‌తో కలిసి నెల రోజులుగా ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇద్దరు కూడా చాలా ఏళ్లు లవ్ రిలేషన్‌లో ఉన్నారు, వారి కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
Read Also: Maharashtra: బీజేపీకి బిగ్ షాక్.. మేయర్ పదవి కోసం ఒక్కటైన షిండే శివసేన, రాజ్‌ఠాక్రే..
సచిన్ చెబుతున్న దాని ప్రకారం, అతడి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిందని, తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు మహారాజ్‌పూర్‌లోన ఒక ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో పక్క గదుల్లో నివసించే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతో సంబంధాన్ని పెట్టుకుందని ఆరోపించాడు. రెండు రోజుల క్రితం తాను గ్రామానికి వెళ్లానని, ఆ రాత్రి తిరిగి రాలేనని భార్యకు చెప్పినట్లు సచిన్ పోలీసులకు తెలిపారు. అయితే, శుక్రవారం రాత్రి తాను ఊహించకుండా ఇంటికి వచ్చే సమయానికి తన భార్య ఇద్దరు పురుషులతో మంచంపై పడుకుని ఉండటాన్ని చూసినట్లు వెల్లడించారు. తాను తన సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను మొత్తం రికార్డ్ చేశానని, ఆ సమయంలో ఇద్దరు వ్యక్తుల్ని తన భార్య తనపైకి కొట్టాలని ఉసిగొల్పిందని పోలీసులతో చెప్పాడు.
ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని, సంబంధిత వ్యక్తులందర్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, సచిన్ ఈ విషయాన్ని పరిష్కరించుకుంటామని ఆ సమయంలో పోలీసులకు చెప్పడంతో, అతడిని విడుదల చేశారు. అయితే, తాను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, భార్య ఇద్దరు వ్యక్తుల్ని కూడా విడుదల చేసేలా తనపై ఒత్తిడి తీసుకువచ్చిందని, అందుకు నిరాకరిస్తే తనను వదిలేసి, వారితో ఉంటానని బెదిరించిందని అతను ఆరోపించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆమె తనను చంపుతానని బెదిరించిందని సచిన్ ఆరోపించాడు. ఆవేశంతో తాను భార్య శ్వేతా సింగ్ గొంతు నులిమి హత్య చేసినట్లు చెప్పాడు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
