NTV Telugu Site icon

Uttar Pradesh: 5 ఏళ్ల క్రితం వ్యక్తి మృతి, కట్ చేస్తే.. రెండో భార్య, నలుగురు పిల్లలతో దొరికాడు..

Missing

Missing

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం చనిపోయాడని రిపోర్ట్ చేయబడిని వ్యక్తి రెండో భార్య, నలుగురు పిల్లలతో ఢిల్లీలో పట్టుబడ్డారు. 2018లో కుమార్, అతని సోదరులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి వేద్ ప్రకాష్ క్రిమినల్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు తర్వాత నుంచి కుమార్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్‌పత్‌లో చోటు చేసుకుంది.

అయితే అనూహ్య పరిస్థితుల మధ్య 5 ఏళ్ల తర్వాత 45 ఏళ్ల కుమార్, యోగేంద్ర కుమార్ అనే పేరుతో ట్యాక్సీడ్రైవర్‌గా పనిచేస్తూ ఢిల్లీలో పట్టుబడ్డాడు. అతడు ఓ మహిళను పెళ్లి చేసుకుని, నలుగురు పిల్లలతో నివసిస్తున్నారు. 2018 తర్వాత కుమార్‌పై వేద్ ప్రకాష్ క్రిమినల్ కేసుల నమోదు చేయగా అతను అదృశ్యమయ్యాడు. దీనిపై సింఘావలీ అహిర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Read Also: Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వద్దన్నందుకు భర్త గొంతు కోసి చంపిన భార్య..

కుమార్‌ని ప్రకాష్ హత్య చేసినట్లు అతనిపై కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులపై డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరు ఏప్రిల్ 2023న వేద్ ప్రకాష్, మరో ఇద్దరిపై కిడ్నాప్, హత్య నేరాలు నమోదయ్యాయి. అయితే 8 నెలల విచారణ తర్వాత కూడా కుమార్ హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు.

ఇటీవల పెండింగ్ కేసుల విచారణలో భాగంగా కుమార్ ఢిల్లీలో వేరే పేరుతో ఢిల్లీలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండో వివాహం చేసుకుని, నలుగురు పిల్లలతో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. విచారణలో వేద్ ప్రకాష్‌తో తన శతృత్వం, ఢిల్లీలోని రోహిణిలో మరో మహిళతో వివాహేతర సంబంధంపై పోలీసులకు కుమార్ చెప్పాడు. 2018లో సొంతూరిని వదిలి వేరే మహిళలో ఉంటున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కుమార్ మొదటి భార్య మాట్లాడుతూ.. అతను 2018 నుంచి మమ్మల్ని కలుసుకోలేదని చెప్పారు.