Site icon NTV Telugu

Fire Accident : రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..

rangareddy

rangareddy

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి.. షార్ట్ సర్కుట్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. రంగారెడ్డి జిల్లా.. మైలార్ దేవులపల్లి.. టాటానగర్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాంకెట్ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో గోడౌన్ లో 10 కార్మికులు పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. దాదాపు 1000 గజాల స్థలంలో ఈ గోడౌన్ ఉంది. లోపల దట్టమైన పొగతోపాటూ, మంటలు కూడా వ్యాపించాయి.. సడెన్ గా జరిగిన ఈ ప్రమాదం వల్ల కార్మికులు ఏం చెయ్యలేక ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు.. ఈ ప్రమాదం పై ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు..

ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 ఫైరింజన్ల ను రంగంలోకి దింపారు. అర్థరాత్రి తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇది పరుపుల గోడౌన్ కావడం వల్ల మంటలు త్వరగా అదుపులోకి రావట్లేదు. ఐతే.. ఇదంతా ఇల్లీగల్‌ గా జరుగుతోందనీ.. అక్రమంగా గోడౌన్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు.. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేసురుకున్నారు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version