Site icon NTV Telugu

Father Kills Teenage Daughter: చూడకూడని స్థితిలో కూతురు.. నరికి చంపిన తండ్రి..

04

04

Father Kills Teenage Daughter: ఓ తండ్రి తన కన్న కూతురును చంపి.. ఏం పట్టనట్లు వచ్చి నిద్రపోయిన సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లాజాట్ గ్రామంలో మంగళవారం ఓ టీనేజ్ బాలిక హత్య ఘటన వెలుగుచూసింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తన తండ్రే బాలికను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

READ MORE: LCA Tejas Mark 1A Jets: మిగ్-21 మించింది రాబోతుంది.. ఇక పాకిస్థాన్‌కు వణుకే..

కూతురును వెతుక్కుంటూ వెళ్లి.. ఖతం చేశాడు..
హత్యకు గురైన టీనేజర్ నేహా సమీప గ్రామానికి చెందిన ఓయువకుడితో ప్రేమలో ఉందని పోలీసులు తెలిపారు. ఈసందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. సోమవారం రాత్రి ఆమె తన ప్రియుడిని కలవడానికి పొలానికి వెళ్లింది. ఇంతలో బాలిక తండ్రి ఇంద్రపాల్ కూడా ఆమెను వెతుకుంటూ అక్కడికి వెళ్లాడు. తన కూతురు ఆ యువకుడితో అభ్యంతరకరమైన స్థితిలో ఉండటం చూసి కోపంతో ఊగిపోయి గొడ్డలితో నరికి చంపాడు. సంఘటన తర్వాత ఆ ఏం జరగనట్లు ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోయాడు. ఉదయం పొలంలో బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో తండ్రి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో అతడిని అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ హత్య గ్రామంలో సంచలనం సృష్టించింది. పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. మృతురాలి తండ్రి ఇంద్రపాల్ ప్రవర్తన ఎప్పుడూ వింతగా ఉండేదని చెప్పారు. ఓ సొంత తండ్రి తన కూతురును ఇంత దారుణంగా హత్య చేయగలడని నమ్మలేకపోతునట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

READ MORE: Rare tradition: వింతైన ఆచారం.. మూడు రోజులు పాములు కాటేయవు!

Exit mobile version