Shocking News: తన మాట వినడం లేదని 5 ఏళ్ల కూతురిని తండ్రి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్‌లో జరిగింది. పొరుగింటికి పదే పదే వెళ్తుందనే కోపంతో బాలిక గొంతు నులిమి, నాలుగు ముక్కలుగా నరికి హత్య చేశాడు. నిందితుడు మోహిత్ తన పొరుగింటి వారైన రాము కుటుంబంతో గొడవపడుతున్నాడు. తనతో విరోధం ఉన్న పొరుగింటికి తన కుమార్తె వెళ్తుందనే ఒకే ఒక్క కారణంతో హత్యకు పాల్పడ్డాడు.
Read Also: Mohammed Shami: షమీకి మద్దతుగా దేశం.. జమాత్ చీఫ్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
ఫిబ్రవరి 25న చిన్నారి తప్పిపోయిందనే సమాచారం పోలీసులకు అందింది. నాలుగు టీంలతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా, బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. తర్వాతి రోజు శరీరానికి సంబంధించిన అన్ని భాగాలు దొరికాయి. దీంతో దీనిని హత్యగా తేల్చారు. దర్యాప్తులో భాగంగా బాలిక తండ్రి అదృశ్యమవ్వడంపై అనుమానంతో పోలీసులు ఇరుగుపొరుగు వారిని ప్రశ్నించారు. ఘటన తర్వాత నిందితుడు తన ఫోన్‌ని తన భార్యకు ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఘటన తర్వాత అతను కనిపించడంతో పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించడంతో అసలు నిజాన్ని వెల్లడించారు.
తానే, తన కూతుర్ని చంపినట్లు ఒప్పుకున్నాడు. మోహిత్ కుటుంబం, పొరుగున ఉంటే రాము కుటుంబం గత కొన్నేళ్లుగా చాలా మంది సంబంధాలను కలిగి ఉన్నారు. అయితే, ఇటీవల రెండు కుటుంబాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అయితే, మోహిత్ తన కుమార్తె రాము ఇంటికి వెళ్లడం మానేయాలని పదేపదే హెచ్చరించాడు. అయితే, బాలిక వారింటికి వెళ్లి ఆడుకునేది. సంఘటన జరిగిన రోజు బాలిక, రాము ఇంటి నుంచి రావడాన్ని చూసిన మోహిత్ కోపంతో, బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నలుమి హత్య చేశాడు.