NTV Telugu Site icon

AP Crime: కాళ్లు, చేతులు కట్టేసి.. బకెట్‌లో ముంచి ఇద్దరు కుమారుల హత్య.. ఆపై..

Crime

Crime

AP Crime: కాకినాడలో మూడు మరణాలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి.. ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా హత్యచేసిన ఓ తండ్రి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.. రాష్ట్రంలో కలకలం సృష్టిచిన కాకినాడ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ వోఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు చంద్ర కిషోర్ అనే వ్యక్తి.. భార్య తనూజ.. ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్న చంద్రకిషోర్.. ఒకటో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు జోషీల్, యూకేజీ చదువుతున్న రెండో కొడుకు నిఖిల్‌ను అత్యంత పాశవికంగా ప్రాణాలు తీశాడు.. ఇద్దరి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలల ముంచి.. ఊపిరి ఆడకుండా చేసి.. ఇద్దరని చంపేశాడు.. ఇక, పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను ఉరి వేసుకున్న ఆత్మహత్య చేసుకున్నాడు చంద్ర కిషోర్..

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

భార్య తనూజ.. పిల్లలను హోలీ వేడుకలకు తీసుకుని వెళ్లిన చంద్ర కిషోర్.. ఆ తర్వాత పిల్లలకు యూనిఫామ్ కోసం టైలర్ దగ్గరికి తీసుకుని వెళ్తానని ఇంటికి తీసుకుని వచ్చాడు.. ఈ మధ్యనే పిల్లలు స్కూల్‌ మార్చినట్టుగా చెబుతున్నారు.. అయితే, ఇద్దరు కుమారులను కన్న తండ్రే ఇంత దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.. పిల్లలు చదువులో వెనకబడ్డారని హత్య చేశాడనే ఓ వాదన ఉండగా.. అసలు ఈ హత్యలు, ఆత్మహత్యల వెనుక ఏం జరిగింది.. ఏ కారణంతో ఆ తండ్రి ఇంత కిరాతకంగా మారిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ముగ్గురి మరణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.. ఆత్మహత్య చేసుకున్న చంద్రకిషోర్‌.. సూసైడ్‌ నోట్‌ రాశాడు.. పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని.. దీంతో వారిని చంపేసినట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.. అయితే, భార్యను నమ్మించి.. ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేశాడు..