Site icon NTV Telugu

Tamil nadu: ఐదుగురు కుటుంబ సభ్యులతో వ్యాపారవేత్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!

Tamilnadu

Tamilnadu

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్త కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఓ పాడుబడిన కారులో మృతదేహాలు లభించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్

మణికందన్ (50) అనే వ్యాపారవేత్త.. భార్య నిత్య, తల్లి సరోజ, ఇద్దరు పిల్లలతో సేలంలో నివాసం ఉంటున్నాడు. మణికందన్ మెటల్ వ్యాపారం చేస్తున్నాడు. ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ.. కుటుంబమంతా తీవ్రమైన నిర్ణయం తీసుకుని ప్రాణాలు వదిలారు. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలు పాడుబడిన కారులో కనిపించాయని పోలీసులు తెలిపారు. తిరుచ్చి-కరైకుడి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం కారు ఆగి ఉంది. రెండు రోజుల నుంచి కారు ఆగి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించారు. బాధితులు విషం సేవించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఇది కూడా చదవండి: Devara: నైట్ ఒంటి గంటకు 500 షోలు.. మెంటలెక్కిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్

ఇక కారులోంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణికందన్.. మెటల్ వ్యాపారం చేస్తూ అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లే ఆత్మహత్యకు పురికొల్పి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సేలం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఐదుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంత దూరం వచ్చి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ram Charan: ‘దేవర’కి చరణ్ విషెష్

Exit mobile version